కమ్మ, వెలమ సంఘాలకు భూ కేటాయింపుపై టీఎస్ హైకోర్టులో విచారణ

కమ్మ, వెలమ సంఘాలకు భూ కేటాయింపుపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.కేయూ విశ్రాంత ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై సీజే బెంచ్ విచారణ చేపట్టింది.

 Inquiry In Ts High Court On Allotment Of Land To Kamma And Velama Sanghas-TeluguStop.com

2021లో ఖానామెట్ లో ఐదు ఎకరాల చొప్పన ఉచితంగా కేటాయింపులు జరిగిన విషయం తెలిసిందే.అయితే కులాల వారీగా భూములు కేటాయించడం ఆర్టికల్ 14కి విరుద్ధమని కోర్టు తెలిపింది.ఈ సందర్భంగా ప్రభుత్వ తీరు సమాజంలో కులాల విభజనకు దారితీసేలా ఉందని వ్యాఖ్యనించింది.21వ శతాబ్దంలో హైటెక్ రాష్ట్రంలోనూ ఇదేమి విధానమని హైకోర్టు పేర్కొంది.కులాల వారీగా భూ కేటాయింపులు అసంబద్ధమని, తప్పని వెల్లడించింది.ఎస్సీ, ఎస్టీ, అణగారిన వర్గాలకే భూములు ఇవ్వాలని తెలిపింది.కులాంతర వివాహాలను ప్రోత్సహించడం వంటి విధానాలు ఉండాలని, ప్రభుత్వం విశాలంగా ఆలోచించాలని తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యనించింది.అటు నోటీసులకు స్పందించనందుకు కమ్మ సమాఖ్య వాదనలు వినబోమని స్పష్టం చేసింది.

ఈ క్రమంలో కౌంటర్ దాఖలు చేసేందుకు వెలమ అసోసియేషన్ ధర్మాసనాన్ని సమయం కోరింది.దీంతో తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube