హైదరాబాద్ లోని కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటు చేసుకుంది.నిర్మాణంలో ఉన్న గోడ ఒక్కసారిగా కూలడంతో ఇద్దరు మృత్యువాత పడ్డారు.
కూకట్ పల్లిలోని అడ్డగుట్టలో ఈ ప్రమాదం జరిగింది.
మృతులు బీహార్ కార్మికులుగా గుర్తించారు.
భవన నిర్మాణ పనులు కొనసాగుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
అనంతరం ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.







