నేటి నుంచి ప్రజావాణి ప్రారంభం..

జూన్ 07లోక్ సభ ఎన్నికల కోడ్ ( Election Code )కారణంగా వాయిదా పడిన ప్రజావాణి కార్యక్రమం శుక్రవారం నుంచి తిరిగి ప్రారంభం కానుంది.ఈ విషయాన్ని గురువారం ప్రజావాణి ఇంచార్జీ, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి.

 Prajavani Will Start From Today , Chairman Dr. G. Chinnareddy, Prajavani-TeluguStop.com

చిన్నారెడ్డి వెల్లడించారు.దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉన్నందు వల్ల ప్రజావాణి అర్జీల కార్యక్రమం తాత్కాలికంగా వాయిదా పడిందని చిన్నారెడ్డి పేర్కొన్నారు.

ఎన్నికల కోడ్ ముగిసిన నేపథ్యంలో ప్రజావాణి అర్జీల స్వీకరణ కార్యక్రమం మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్ లో ప్రతి వారం మంగళ, శుక్ర వారాల్లో కొనసాగుతుందని చిన్నారెడ్డి వివరించారు.ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవా లని, ప్రజలు తమ సమస్య లను అర్జీల ద్వారా ప్రజా వాణిలో అందజేయాలని చిన్నారెడ్డి కోరారు.

ప్రజావాణి స్టేట్ నోడల్ ఆఫీసర్ గా రాష్ట్ర మున్సిపల్ డైరెక్టర్ దివ్య వ్యవహరిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube