నేడు మేడిగడ్డలో పర్యటించనున్న మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి

జూన్ 07 రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనున్నారు.మేడి గడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల ఆనకట్ట మరమ్మ తులను ఉత్తమ్ సమీక్షించ నున్నారు.

 Minister Uttamkumar Reddy Will Visit Medigadda Today , Medigadda, Minister Utta-TeluguStop.com

ఎన్​డీఎస్​ఏ కమిటీ సిఫార్సు ల మేరకు చేపడుతున్న చర్యల పురోగతిని తెలుసుకోనున్నారు.నీటిపారుదలశాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ అనిల్ కుమార్, ఇతర ఇంజినీర్లతో కలిసి పనులపై ఆరా తీయను న్నారు.

మరోవైపు జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ మధ్యంతర నివేది కలో చేసిన సిఫార్సులకు అనుగుణంగా మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల ఆనకట్టల వద్ద మరమ్మతు లు, రక్షణ చర్యలకు సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి.మేడిగడ్డ ఆనకట్టలో కీలక మైన గేట్ల ఎత్తివేత పనులు చేస్తున్నారు.

ఏడో బ్లాకు లోని ఎనిమిది గేట్లకు గాను ఒక గేటును గతంలోనే ఎత్తగా… కుంగిన పియర్స్ మధ్యలో ఉన్న గేటును కటింగ్ ద్వారా తొలగిస్తు న్నారు.మిగిలిన ఆరు గేట్లలో 16, 17వ గేట్లను ఎత్తినట్లు ఇంజనీర్లు తెలిపారు.

గతంలో 16వ గేటు తెరిచే సమయంలో సాంకేతిక సమస్యలు వస్తే ఆపివేసి… అన్నింటిని సరిచేసిన తర్వాత గురువారం ఎత్తారు.మరో నాలుగు గేట్లను కూడా తెరవాల్సి ఉంది.

ఇదే తరహాలో ఆ గేట్లను కూడా తెరిచే ప్రయత్నం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube