హైదరాబాద్ నగరంలోని కూకట్ పల్లిలో భూమి కుంగింది.గౌతంనగర్ లోని ప్రణీత్ హోమ్స్ వద్ద సగానికి పైగా రోడ్డు కుంగిపోయింది.
అయితే భూమి కుంగడంపై కాలనీ వాసులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.రాత్రి సమయాల్లో అపార్ట్ మెంట్ సెల్లార్ లో జిలెటిన్ స్టిక్స్ తో బ్లాస్టింగ్ చేయడం కారణంగానే రోడ్డు కుంగిపోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.