గ్రేటర్ హైదరాబాద్( Greater Hyderabad ) పరిధిలో అక్రమ నిర్మాణాలపై అధికారులు కొరడా ఝుళిపించారు.ఈ క్రమంలో మేడ్చల్ జిల్లాలోని దుండిగల్ లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు.
మల్కాజ్ గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి( Marri Rajashekar Reddy )కి చెందిన ఏరోనాటికల్ ఇంజినీరింగ్ కాలేజీలో అక్రమ కట్టడాలను నేలమట్టం చేస్తున్నారు.చిన్న తామరం చెరువును కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టారని ఫిర్యాదులు వచ్చాయి.
ఈ నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ, ఇరిగేషన్ మరియు మున్సిపల్ శాఖల ఆధ్వర్యంలో కూల్చివేతలు కొనసాగుతున్నాయి.మరోవైపు అధికారులతో కాలేజీ విద్యార్థులు, సిబ్బంది వాగ్వివాదానికి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది.
మరోవైపు రంగారెడ్డి జిల్లాలోని మణికొండ( Manikonda )లోనూ అధికారులు అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు.బఫర్ జోన్ లో లేక్ వ్యూ పేరుతో నిర్మాణాలు వెలిశాయి.దీంతో రంగంలోకి దిగిన రెవెన్యూ అధికారులు విల్లాలను కూల్చివేస్తున్నారు.