తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు అన్యాయం జరుగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.హైదరాబాద్ నాగోల్ లో బీజేపీ నిర్వహించిన ఓబీసీ సమ్మేళనంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు.
బీసీలను అవమానపరిచిన వ్యక్తి సీఎం కేసీఆర్ అని ఆరోపించారు.కులవృత్తుల ప్రోత్సాహం పేరుతో బీసీలను అణగదొక్కుతున్నారని మండిపడ్డారు.
బీసీలు గొర్రెలు, మేకలు మేపుకుంటూ ఉండాలని చూస్తున్నారన్నారు.రాష్ట్రంలో 50 శాతం మంది బీసీలు ఉంటే ముగ్గురికే మంత్రి పదవులు వచ్చాయన్నారు.
ఈ నేపథ్యంలో బీసీలంతా ఐక్యంగా ఉండాలని సూచించారు.