శంకరమ్మకు గన్ మెన్లను కేటాయించిన తెలంగాణ సర్కార్..!

హైదరాబాద్ :జూన్ 22తెలంగాణ( Telangana ) మలిదశ పోరాట తొలి అమరుడు ఉమ్మడి నల్గొండ జిల్లా మోత్కూరు మండలం పొడిచేడు గ్రామవాసి శ్రీకాంతాచారి తల్లి కాసోజు శంకరమ్మకు సీఎం కేసీఆర్( CM KCR ) ఎమ్మెల్సీ పదవి కేటాయించడం ఖాయమని తెలుస్తోంది.అమరవీరుల స్మృతి వనం ఆవిష్కరణలో పాల్గొనాలని ప్రభుత్వం నుంచి పిలుపు రావడంతో.

 Telangana Government Assigned Gunmen To Shankaramma..!,shankaramma, Cm Kcr , Ts-TeluguStop.com

అందులో భాగంగానే బుధవారం నాడు పార్టీ అధినేతను ఆమె కలిసినట్లు విశ్వసనీయ సమాచారం.ఆమెకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని గులాబీ బాస్ నిర్ణయం తీసుకున్నట్లు అధికార పార్టీలో జోరుగా చర్చ సాగుతుంది.

గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి.

దీంతో అభ్యర్థుల ఎంపికపై గత కొద్ది రోజులుగా కేసీఆర్ కసరత్తు చేస్తున్న విషయం అందరికి తెలిసిందే.

ఈ తరుణంలోనే అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరగలేదని నిరసన వ్యక్తం అవుతుండటం.రానున్న ఎన్నికల్లో ఈ ప్రభావం పెద్ద ఎత్తున పడుతుందని భావించిన కేసీఆర్ శంకరమ్మకు శాసనమండలి సభ్యురాలిగా ఎంపిక చేసేందుకు సిద్ధమైనట్టు తెలిసింది.

ఇందులో భాగంగా శంకరమ్మకు ఓ పీఏ, గన్ మెన్‌గా ఓ కానిస్టేబుల్‌తో పాటు ఆమెకు ప్రభుత్వ వెహికల్ కేటాయించినట్లు సమాచారం.గురువారం నుండి పూర్తిగా అందుబాటులో ఉండాలని ఆమెకు అధికారులు సూచించినట్లు తెలుస్తోంది….

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube