హైదరాబాద్ లోని ఓ పోలింగ్ ఆఫీసర్ పై కేసు పెట్టాలని జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ ఆదేశాలు జారీ చేశారని తెలుస్తోంది.184ఏ పోలింగ్ బూత్ లో ఓటింగ్ తీరుపై ఆయన సీరియస్ అయ్యారు.
పోలింగ్ కేంద్రంలో అక్రమంగా ఓటింగ్ జరుగుతున్నట్లు సీఈవో, డీఈవో గుర్తించారని సమాచారం.ఈ నేపథ్యంలో ఇద్దరిద్దరు పోలింగ్ కంపార్ట్ మెంట్ లోకి వెళ్తున్నట్లు గుర్తించడంతో పాటు ఓ వ్యక్తి అక్కడ నిలబడి ఓటు వేస్తున్నట్లు సీఈవో వికాస్ రాజ్ గుర్తించారు.
దీంతో నిర్లక్ష్యంగా వ్యవహారించిన పోలింగ్ అధికారిపై కేసు పెట్టాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేశారని తెలుస్తోంది.