కాంగ్రెస్ సర్కార్ మంత్రి వర్గంలో కోదండరాంకు చోటు దక్కెనా...

హైదరాబాద్ డిసెంబర్ 05:తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు దక్కించుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది నేడో రేపో ప్రభుత్వం కొలువుదీరనుంది.కాంగ్రెస్ పార్టీ ( Congress party )అధికారంలోకి రావటంలో పలువురు మేధావులు ప్రొఫెసర్లు చేసిన కృషి ఫలించింది ఇందులో టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంకేసీఆర్ ఓడించాల్సిందే అంటూ అన్ని జిల్లాల్లో ప్రతి మీటింగ్ లో చెబుతూ వచ్చారు.

 Did Kodandaram Get A Place In The Ministerial Category Of The Congress Governmen-TeluguStop.com

కేసీఆర్ ఓడించాలంటే అందరూ కలిసి పోటీ చేయాలని ఆయన ప్రతిపాదించారు కూడా.ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండటమే కాదు కాంగ్రెస్ పూర్తి మద్దతు కూడా ప్రకటించారు టీజేఎస్ కార్యకర్తలు కాంగ్రెస్‌తో పనిచేయాలని సూచించారు.

వీరి కృషి ఫలించి కాంగ్రెస్ మేజిక్ ఫిగర్ దాటి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ కోదండరాం( Kodandaram )కు కాంగ్రెస్ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగిస్తుందని ప్రచారం జరుగుతోంది ఆయన్ను ఎమ్మెల్సీగా చేసి మంత్రిపదవి కూడా ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.ఉన్నత విద్యావంతుడైన కోందండరాంను శాసనమండలికి పంపి ఆయనకు విద్యాశాఖను కట్టబెట్టాలని కాంగ్రెస్ భావిస్తోందని ప్రచారం జరుగుతోంది.

ఒకవేళ ఆయన్ను మంత్రిగా చేయటం కుదరకపోతే టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌గా నియమించాలని కాంగ్రెస్ భావిస్తోందట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube