మహిళా క్రికెటర్లతో కోచ్ జైసింహా( Jaisimha ) అసభ్య ప్రవర్తనపై హెచ్సీఏ తీవ్రస్థాయిలో ఫైర్ అయింది.ఈ మేరకు జైసింహాను కోచ్ పదవి నుంచి తక్షణమే తొలగిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది.
విచారణ ముగిసేంత వరకు హెడ్ కోచ్ గా జైసింహాను తప్పించినట్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు ( Cricket Association President Jaganmohan Rao )తెలిపారు.మహిళా క్రికెటర్ల రక్షణకు భంగం కలిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
అలాంటి వారు ఎవరైనా క్రిమినల్ కేసులు పెడతామని వెల్లడించారు.అలాగే జైసింహా వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ జరపాలని కీలక ఆదేశాలు జారీ చేశారు.విచారణ పూర్తయ్యే వరకు కోచ్ ను తప్పిస్తున్నామన్న హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు మహిళా క్రికెటర్లకు అండగా ఉంటామని స్పష్టం చేశారు.