Jaisimha : మహిళా క్రికెటర్లతో కోచ్ అసభ్య ప్రవర్తనపై హెచ్‎సీఏ సీరియస్

మహిళా క్రికెటర్లతో కోచ్ జైసింహా( Jaisimha ) అసభ్య ప్రవర్తనపై హెచ్‎సీఏ తీవ్రస్థాయిలో ఫైర్ అయింది.

ఈ మేరకు జైసింహాను కోచ్ పదవి నుంచి తక్షణమే తొలగిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది.

విచారణ ముగిసేంత వరకు హెడ్ కోచ్ గా జైసింహాను తప్పించినట్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు ( Cricket Association President Jaganmohan Rao )తెలిపారు.

మహిళా క్రికెటర్ల రక్షణకు భంగం కలిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. """/" / అలాంటి వారు ఎవరైనా క్రిమినల్ కేసులు పెడతామని వెల్లడించారు.

అలాగే జైసింహా వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ జరపాలని కీలక ఆదేశాలు జారీ చేశారు.

విచారణ పూర్తయ్యే వరకు కోచ్ ను తప్పిస్తున్నామన్న హెచ్‎సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు మహిళా క్రికెటర్లకు అండగా ఉంటామని స్పష్టం చేశారు.

నాలుగో పెళ్లికి సిద్ధమైన నటి… పెళ్లి ముహూర్తాలు కూడా ఫిక్స్!