పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు.పరీక్ష కేంద్రాల్లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదు.
జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్రాజన్న సిరిసిల్ల జిల్లా అగ్రహారం డిగ్రీ కళాశాలలో ఈ నెల 09 వ తేదీన నిర్వహించబోయే గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణపై చీఫ్ సూపరింటెండెంట్లతో సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…ఈ నెల 09 వ తేదీన ఉదయం 10.30 గంటల నుండి మధ్యాన్నం 1.00 గంట వరకు కొనసాగే గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు జిల్లాలో 15 పరీక్షా కేంద్రాలలో 4699 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని తెలిపారు.గ్రూప్-1 పోస్టుల ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని,పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ ను అమలలో ఉంటాదని,పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాలలో ప్రత్యేకంగా పోలీసు నిఘా ఏర్పాటు చేసి జనాలు గుమిగూడకుండా చర్యలు చేపడుతామన్నారు.గ్రూప్-1 పరీక్ష కేంద్రాలలోకి అభ్యర్థులు , చీప్ సూపర్డెంట్ లకు, అబ్జర్వర్లకు,బయోమెట్రిక్ ఇన్విజిలేటర్లకు, ఇన్విజిలేటర్లకు తప్ప ఇతరులను అనుమతించ వద్దని,పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఇతర శాఖల అధికారుల సమన్వయంతో పకడ్బందీగా నిర్వహించాలన్నారు.పరీక్ష కేంద్రాలలోనికి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని , ఒక్క చీఫ్ సూపరిండింట్ వద్ద తప్ప ఎవ్వరి మొబైల్ ఫోన్ లకు అనుమతి లేదని స్పష్టం చేశారు.ఈ సమావేశంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, అగ్రహారం డిగ్రీ కలశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ చీఫ్ సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.