డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ అక్రమ అరెస్ట్ అప్రజాస్వామికం

బోయినిపల్లి :30 లక్షల మంది నిరుద్యోగుల కోసం తెలంగాణ బి ఎస్ పి రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ చేస్తున్న అమరణ నిరాహారదీక్ష ను పోలీస్ లు భగ్నం చేసి అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తూ కోదురుపాక x రోడ్ చౌరస్తాలో రాస్తారోకో చేపట్టి నిరసన చేయడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తన కూతురు అయిన కవిత లిక్కర్ కేసు మీద వున్న శ్రద్ధ 30 లక్షల మంది నిరుద్యోగుల మీద లేదన్నారు.

 Illegal Arrest Of Dr. Rs Praveen Kumar Is Undemocratic , Dr. Rs Praveen Kumar ,-TeluguStop.com

అనంతరం మాంకాలి తిరుపతి మాట్లాడుతూ మొన్న జరిగినటువంటి గ్రూప్1 ఎక్జామ్ పేపర్ లికేజ్ కి కారణం అయినటువంటి నిందితులను తక్షణమే అరెస్ట్ చేసి శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.అదే విదంగా ఈ కేసును సీబీ, సిఐడి కి అప్పజెప్పాలని వారు డిమాండ్ చేశారు.

ఈ లీకేజీ లో నిందితులుగా ఉన్న ఎలాంటి పెద్ద వారినైనా వదిలిపెట్టేది లేదు అని వారు డిమాండ్ చేశారు.అదే విధంగా అక్రమంగా అరెస్ట్ చేసిన డా.ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ని అరెస్ట్ చేసినందుకు వారికి క్షమాపణ చెప్పాలని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు ఇళ్లేందుల అరుణ్ ,మండల ప్రధాన కార్యదర్శి కన్నం అనిల్, సెక్టార్ అధ్యక్షులు బొడ్డు రాజలింగం,కొత్తపేట గ్రామ అధ్యక్షులు పొత్తూరి శేఖర్,మండల సీనియర్ నాయకులు పెగ్గర్ల మహేందర్, సందరిగి రమేష్.

కన్నం రాజు,ఎడపెళ్లి ఈశ్వర్,అనిల్,రాజు,మహేందర్,సురేష్,సతీష్,శ్రీకర్,అజయ్,రాజయ్య,లు తదితరులు పాల్గొన్నారు….

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube