డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ అక్రమ అరెస్ట్ అప్రజాస్వామికం

బోయినిపల్లి :30 లక్షల మంది నిరుద్యోగుల కోసం తెలంగాణ బి ఎస్ పి రాష్ట్ర అధ్యక్షులు డా.

ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ చేస్తున్న అమరణ నిరాహారదీక్ష ను పోలీస్ లు భగ్నం చేసి అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తూ కోదురుపాక X రోడ్ చౌరస్తాలో రాస్తారోకో చేపట్టి నిరసన చేయడం జరిగింది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తన కూతురు అయిన కవిత లిక్కర్ కేసు మీద వున్న శ్రద్ధ 30 లక్షల మంది నిరుద్యోగుల మీద లేదన్నారు.

అనంతరం మాంకాలి తిరుపతి మాట్లాడుతూ మొన్న జరిగినటువంటి గ్రూప్1 ఎక్జామ్ పేపర్ లికేజ్ కి కారణం అయినటువంటి నిందితులను తక్షణమే అరెస్ట్ చేసి శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.

అదే విదంగా ఈ కేసును సీబీ, సిఐడి కి అప్పజెప్పాలని వారు డిమాండ్ చేశారు.

ఈ లీకేజీ లో నిందితులుగా ఉన్న ఎలాంటి పెద్ద వారినైనా వదిలిపెట్టేది లేదు అని వారు డిమాండ్ చేశారు.

అదే విధంగా అక్రమంగా అరెస్ట్ చేసిన డా.ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ని అరెస్ట్ చేసినందుకు వారికి క్షమాపణ చెప్పాలని వారు అన్నారు.

ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు ఇళ్లేందుల అరుణ్ ,మండల ప్రధాన కార్యదర్శి కన్నం అనిల్, సెక్టార్ అధ్యక్షులు బొడ్డు రాజలింగం,కొత్తపేట గ్రామ అధ్యక్షులు పొత్తూరి శేఖర్,మండల సీనియర్ నాయకులు పెగ్గర్ల మహేందర్, సందరిగి రమేష్.

కన్నం రాజు,ఎడపెళ్లి ఈశ్వర్,అనిల్,రాజు,మహేందర్,సురేష్,సతీష్,శ్రీకర్,అజయ్,రాజయ్య,లు తదితరులు పాల్గొన్నారు.

వీడియో: వాననీళ్లు మైక్రోస్కోప్‌తో చూస్తే ఎలా కనిపిస్తాయో తెలుసా..