సినిమా ఇండస్ట్రీలో కేవలం హిట్టు మాత్రమే మాట్లాడుతుంది.హిట్ ఉన్న వారికే మళ్ళీ అవకాశాలు వస్తాయి.
కానీ కొన్నిసార్లు హిట్స్ లేకపోయినా ఏదో అదృష్టం కొద్ది ప్రాజెక్ట్స్ దక్కించుకుంటూ ఉంటారు కొంతమంది హీరోయిన్స్. గతంలో ఎన్ని విజయాలు ఉన్నా, పరాజయాలు ఉన్న ఇప్పుడు ఈ అదృష్టంతో మరిన్ని అవకాశాలు దక్కించుకొని ఇండస్ట్రీలో బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు కొంతమంది హీరోయిన్స్ ప్రయత్నిస్తూనే ఉన్నారు.
ఇంతకి ఆ హీరోయిన్స్ ఎవరు ? వారు నటిస్తున్న సినిమాలు ఏంటి ? అనే విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఉప్పెన సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది కృతి శెట్టి.( Krithi Shetty ) ఈ చిత్రం తర్వాత వరుసగా కొన్ని సినిమాలను ఒప్పుకుంది.ఒకటి, రెండు సినిమాలు పరవాలేదు అనిపించిన ఆ తర్వాత పరాజయాల జోరు పెరగడంతో టాలీవుడ్ లో ఇక ఆమె మనుగడ కష్టమే అని కొన్నాళ్ల పాటు ఆమెను దూరం పెట్టారు.
అయితే మళ్ళీ శర్వానంద్ హీరోగా వస్తున్న మనమే( Manamey Movie ) అనే సినిమాలో నటిస్తుంది.ఈ సినిమాతో ఆమె లక్ గా భావించి బౌన్స్ బ్యాక్ అవ్వాలని గట్టిగా కోరుకుంటుంది.
వీటితో పాటు మలయాళం లో రెండు సినిమాల్లో నటిస్తుంది కృతి శెట్టి.
ఇక కిలాడి సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది మీనాక్షి చౌదరి.( Meenakshi Chowdary ) గుంటూరు కారం పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్నా ఈ సినిమా మిస్ఫైర్ అవ్వడంతో మీనాక్షి కెరియర్ గందరగోళంలో పడింది.అయితే ఈ అమ్మడికి అదృష్టం గట్టిగానే ఉంది.
దాంతో లక్కీ భాస్కర్, మట్కా సినిమాల్లో నటిస్తోంది.ఇది కాకుండా మలయాళం లో సైతం ఓ చిత్రంలో నటించడం విశేషం.
ఈ సినిమాలతో తనేంటో ప్రూవ్ చేసుకోవాలి అనుకుంటుంది మీనాక్షి.
ఏజెంట్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సాక్షి వైద్య.( Sakshi Vaidya ) ఆ సినిమా పరాజయం పాలవడంతో మళ్లీ ఇండస్ట్రీలో మనుగడ కష్టం అనిపించింది.దీనితో పాటు వరుణ్ తేజ్ సినిమా అయినా గాండీవదారి అర్జున చిత్రంలో కూడా నటించిన ఈ రెండు సినిమాలు పరాజయం పాలయ్యాయి.
ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ఈ రెండు సినిమాలు భారీ ఫ్లాప్స్ మూట కట్టుకోవడంతో ఈ అమ్మడికి కష్టకాలం మొదలైంది.అయినా కూడా రవితేజ పిలిచి మరి ఒక సినిమాలో అవకాశం ఇచ్చాడు.
దానికి ఫలితం ఎలా ఉంటుందో వేచి చూడాల్సి ఉంది.
వీరు మాత్రమే కాదు హిట్స్, ఫ్లాప్స్ అనే బేధం లేకుండా మాళవిక నాయర్, నభా నటేష్ వంటి హీరోయిన్స్ కూడా వరుస అవకాశాలు అందుకుంటూనే ఉన్నారు.ఇక పెళ్లిచూపులు సినిమాతో విజయాన్ని అందుకున్న రీతు వర్మ సైతం తెలుగులో నటించడం లేదు కానీ వేరే భాషల్లో బాగా బిజీగానే ఉంది ఈ అమ్మడు.