ఏపీ సీఎం జగన్( AP CM YS Jagan ) పై రాయి దాడి కేసులో నిందితులను మరి కాసేపటిలో పోలీసులు కోర్టు ఎదుట హాజరుపరచనున్నారు.ఈ మేరకు నిందితులతో పాటు మరికొందరిని కూడా న్యాయస్థానంలో ప్రవేశపెట్టనున్నారు.
అయితే సిమెంట్ రాయి ముక్క( Stone )తో సీఎం జగన్ పై దాడికి పాల్పడినట్లు నిందితులు పోలీసులతో చెప్పారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే వివేకానంద స్కూల్( Vivekananda School ) పక్కన రోడ్డు పై నుంచి దాడి చేశారని సమాచారం.
అనంతరం తమ ఇళ్లకు వెళ్లిపోయారని పోలీసులు గుర్తించారు.సీఎం జగన్ పై రాయి దాడి ఘటన( Stone Attack on CM Jagan )పై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
ప్రధాన నిందితుడితో పాటు అదుపులోకి తీసుకున్న వారి స్టేట్ మెంట్ ను పోలీసులు రికార్డ్ చేశారు.ఈ నేపథ్యంలోనే నిందితులను పోలీసులు కోర్టుకు తరలిస్తున్నారు.