టాలీవుడ్ అక్కినేని హీరో నాగచైతన్య ( Naga Chaitanya )గురించి మనందరికీ తెలిసిందే.నాగార్జున( Nagarjuna ) తనయుడిగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు.

ఇకపోతే నాగచైతన్య ప్రస్తుతం తండేల్ సినిమాలో( Tandel movie ) నటిస్తూ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.అయితే ఆయన వాళ్ల అమ్మ గురించి, రామా నాయుడు, ఏఎన్నార్ గురించి షాకింగ్ విషయాలు తెలిపారు.
ఆయన లైఫ్ అలా అయిపోవడానికి కారణం అదే అంటూ తెలిపారు.ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగచైతన్య మాట్లాడుతూ.
డిసిప్లేన్ ఇవన్నీ కూడా మేము తాతగారి నుంచి నేర్చుకున్నాము.క్రమ శిక్షణ, టైం సెన్స్ అనేది రామానాయుడు గారు, ఏఎన్నార్ గారు ఇద్దరు టైం సెన్స్ నేర్పించారు.ఒక మనిషి పలానా టైం చెప్పారంటే ఆ సమయానికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి.వాళ్లు కూడా ఎన్నో పనులు వదులుకుని వస్తుంటారు.అలాంటప్పుడు వారికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి అని చెప్పుకొచ్చాడు.డౌన్ టు ఎర్త్ అనేది అమ్మ లేదా నాన్న ఎవరు నేర్పించారు అనే ప్రశ్నకు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు చైతూ.
అందులో నాగచైతన్య మాట్లాడుతూ ఇక తన అమ్మ గురించి మాట్లాడుతూ నేను చిన్నప్పుడు అంతా అమ్మ( mother ) దగ్గరే పెరిగాను.
18 సంవత్సరాలు అమ్మ దగ్గరే ఉన్నాను.అమ్మే నన్ను పెంచింది. అమ్మ చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు.
ఎతిక్స్ ఫాలో అవుతారు.క్రమశిక్షణ, టైం సెన్స్, ఒక పర్సన్ కు రెస్పెక్ట్ ఇవన్నీ అమ్మే నేర్పించారు.
మీలో సెన్సిటివ్ నెస్, కొంచెం మీలో మీకు మాత్రమే సర్కిల్ గీసుకుంటూ ఉండిపోయేది అంతా అమ్మ నుంచే వచ్చాయా అని యాంకర్ అడగ్గా.లేదు అని చైతూ చెప్పాడు.
చిన్నప్పటి నుంచి నాకు సిగ్గు ఎక్కువ.బాగా కంఫార్ట్ ఉన్నవాళ్లతో ఓపెన్ అప్ అవుతాను.
నాకు ఎక్కువ మంది ఫ్రెండ్స్ వద్దు.ఒక 20, 30 మంది ఫ్రెండ్స్ వద్దు.
రోజుకు ఇద్దరు ముగ్గురిని కలవడం నాకు ఇష్టం ఉండదు.నలుగురు, ఐదుగురు ఉంటే చాలు.
నిజాయితీగా ఉండే వాళ్లు చాలు.నేను తప్పు చేస్తే నాకు చెప్పాలి.
అలాంటి ఫ్రెండ్స్ నాకు ఉన్నారు.అది చాలు అంటూ చెప్పుకువచ్చారు.




తాజా వార్తలు