ఒక సినిమా సక్సెస్ సాధించింది అంటే ఆ సినిమా మీద ఆదర్శకుడు పెట్టిన ఎఫర్ట్ వర్కౌట్ అయిందనే చెప్పాలి.ముఖ్యంగా ఒక సినిమా తీయడానికి ప్రతి ఒక్క దర్శకుడు కూడా వాళ్ల సినిమాల మీద విపరీతమైన ఎఫర్ట్ పెడుతూ సినిమాలు చేస్తూ ఉంటారు.
ఇక అందులో కొందరి ఎఫర్ట్ లు పనిచేసి ఆ సినిమాలు సూపర్ సక్సెస్ అయితే, మరి కొందరి ఎఫర్ట్ మాత్రం వృధా అయిపోయి ఆ సినిమాలు ఫ్లాపులుగా మిగులుతాయి.సినిమాలు ప్లాప్ అయినంత మాత్రాన వాళ్లు కష్టపడరు అని కాదు సినిమా హిట్ అయినా ప్లాప్ అయిన వాళ్ల కష్టం మాత్రం ఒకేలా ఉంటుంది.
ఇక ఇదిలా ఉంటే దర్శక ధీరుడుగా మంచి గుర్తింపును సంపాదించుకున్న రాజమౌళి( Rajamouli ) చేసిన యమదొంగ సినిమాలో( Yamadonga Movie ) ఒక సీన్ ని సినిమాలో పెట్టవద్దని తెగ వాదించారట.కానీ ఆ స్టోరీ రాసిన విజయేంద్ర ప్రసాద్( Vijayendra Prasad ) మాత్రం ఆ సీన్ సినిమాలో ఉండాల్సిందే అని చెప్పి పట్టు పట్టి మరి ఆ సీన్ ను సినిమాలో పెట్టించాడట… అది ఏ సీను అంటే ఎన్టీఆర్( NTR ) చనిపోయి యమలోకానికి పోయిన తర్వాత అక్కడ కొన్ని డబల్ మీనింగ్ తో సాగే డైలాగ్స్ తో కూడిన సిన్ ఒకటి ఉంటుంది.
అదే సీన్ ని సినిమాలో పెట్టొద్దని రాజమౌళి ఎంత వాదించినా కూడా వాళ్ళ నాన్న మాత్రం అసలు వినకుండా మాస్ ప్రేక్షకుల్ని అట్రాక్ట్ చేయాలంటే ఇలాంటి డైలాగులు ఉండాలి.అలాగే వాళ్ళ ద్వారానే సినిమాకి ఎక్కువ కలెక్షన్స్ వస్తాయని చెప్పి మరి ఆ సీన్ ని సినిమాలో ఉంచారట.అయితే అవి పెద్దగా వల్గర్ డైలాగ్ లు ఏమీ కాకపోయినా కూడా అప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం అవి కొంచెం శ్రుతి మించిన డైలాగులనే చెప్పాలి.
ఇక ఇప్పుడంటే భారీగా బూతు డైలాగులను రాస్తూ, బూతు సినిమాలు కూడా చేస్తున్నారు.కాబట్టి అలాంటి సీన్లు ఇప్పుడు పెద్దగా ఏమి అనిపించకపోవచ్చు.కానీ ఒకప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ అలాంటి సీన్లను చూడాలంటే కొంత ఇబ్బంది పడేవారు.
ఇక అలాంటి డైలాగ్స్ సినిమాలో పెట్టకుండా రాజమౌళి చాలా ప్రయత్నం చేశాడు.కానీ విజయేంద్రప్రసాద్ మాత్రం రాజమౌళి మాట వినకుండా ఆ సన్ ను సినిమాలో పెట్టించి ఈ మూవీ సూపర్ సక్సెస్ అయ్యేలా చేశాడు…
.