నల్లగొండ జిల్లా: లోక్ సభ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని జిల్లా ఎన్నికల అధికారి,జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన అన్నారు.ఆదివారం ఎన్నికల కోడ్ ఆఫ్ కండక్ట్ పై జిల్లా ఎస్పీ చందనా దీప్తితో కలిసి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 14 లక్షల 90 వేల 431 మంది ఓటర్లు ఉన్నారని,ఏప్రిల్ నెల 18 నుండి నామినేషన్స్ స్వేకరణ మొదలై ఏప్రిల్ 25 వరకు నామినేషన్లకు గడువు ఉంటుందని,మే 13న పోలింగ్,జూన్ 4న కౌంటింగ్ జరుగుతుందని తెలిపారు.
దీని కోసం జిల్లా వ్యాప్తంగా మొత్తం 1813 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.జిల్లా పరిధిలో మూడు అంతరాష్ట్ర సరిహద్దులు ఉన్నాయని,
అక్కడ తగిన చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు.ప్రజలు రూ.50 వేలకు మించి నగదు తరలిస్తే సరైన పత్రాలు వెంట ఉండాలని లేకుంటే సీజ్ చేస్తారన్నారు.అనంతరం జిల్లా ఎస్పీ చందనా దీప్తి మాట్లడుతూ జిల్లా వ్యాప్తంగా మోడల్ కోడ్ పకడ్బందీగా అమలు చేస్తామని,ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడమే మా లక్ష్యమని తెలిపారు.జిల్లా వ్యాప్తంగా 247 సమస్యాత్మక ప్రాంతాలు, 439 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తించామని,ప్రతి చోటా సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేస్తామన్నారు.
ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా రాజకీయ పార్టీల నేతలు, ప్రజలు సహకరించాలని కోరారు.ఎవరైనా ఎన్నికల నియమాలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.