ప్రకాశం జిల్లా ఒంగోలులో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలో సెల్ ఫోన్ కలకలం చెలరేగింది.సిబ్బంది కళ్లుగప్పి పరీక్షా కేంద్రంలోని ఓ అభ్యర్థి సెల్ ఫోన్ తీసుకువచ్చినట్లు గుర్తించారు.
అభ్యర్థి వద్ద ఫోన్ ను గుర్తించిన ఇన్విజిలేటర్ పోలీసులకు సమాచారం అందించారు.దీంతో సదరు యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
కాగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పరీక్షా కేంద్రాల్లో గ్రూప్ -1 పరీక్షను అధికారులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.అయితే పరీక్షా కేంద్రంలోకి వచ్చే అభ్యర్థులను సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీ చేయాల్సి ఉంటుంది.
కానీ ఈ విధంగా అభ్యర్థి ఫోన్ తో లోపలికి వెళ్లడంపై సిబ్బంది నిర్లక్ష్యం వహించారని పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.







