Vizag Studio : లైట్లకు కూడా రెంటు కట్టలేదు.. ఆ కారణంతోనే మూతపడ్డ వైజాగ్ స్టూడియో..!

తెలుగు రాష్ట్రాల్లో సినిమా స్టూడియోలకు కొదవలేదు.ముఖ్యంగా హైదరాబాద్‌లో చాలా సినిమా స్టూడియోలు ఉన్నాయి.అయితే మన తెలుగు రాష్ట్రాల్లో తొలి స్టూడియో రాజమండ్రిలో ప్రారంభమైంది.1936 ఏటా లాంచ్ అయిన దీనికి దుర్గా సినీటోన్‌ ( Durga Cinetone )పేరు పెట్టారు.ఆ తర్వాత ఈ స్టూడియో ఓనర్లు ‘సంపూర్ణ రామాయణం’ మూవీ నిర్మించాలని నిర్ణయించారు.అనుకున్నదే తడవుగా స్టూడియోలోనే సెట్‌ నిర్మించి షూటింగ్ కూడా ప్రారంభించేశారు.ఎన్నో ఆశలతో ప్రారంభించిన ఈ సినిమా అనుకోని కారణాలవల్ల ఆగిపోయి అందరికీ తీవ్ర నిరాశను మిగిల్చింది.ఓనర్లు ఈ స్టూడియోను కూడా క్లోజ్ చేశారు.

 How This Studio Collapsed-TeluguStop.com

అప్పటికే సినిమా షూటింగ్‌కి కావాల్సిన చాలా పరికరాలను కొనేశారు.అవి వేస్ట్ అయిపోకుండా వాటిని బొబ్బిలి రాజావారు, చిక్కవరం జమీందారులకు అమ్మేశారు.

వారిద్దరూ వాటిని కొనుగోలు చేశాక “ఆంధ్రా సినీటోన్‌” పేరిట వైజాగ్‌లో ఓ స్టూడియోను లాంచ్ చేశారు.

Telugu Bhakta Jayadeva, Durga Cinetone, Pashupatastra, Vizag Studio-Movie

ఇదే స్టూడియోలో సి.పుల్లయ్య డైరెక్షన్‌లో ‘మోహిని భస్మాసుర( Mohini Bhasmasura )’, హిరేన్‌బోస్‌ దర్శకత్వంలో ‘భక్త జయదేవ’ ప్రొడ్యూస్‌ చేశారు.ఈ రెండిటి తర్వాత ముచ్చటగా మూడో మూవీని కూడా నిర్మించారు.

కొచ్చెర్లకోట రంగారావు దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా పేరు ‘పాశుపతాస్త్ర’.ఈ మూడు సినిమాల నిర్మాణం కోసం స్టూడియో ఓనర్లు ఓ కంపెనీ నుంచి లైట్లను అద్దెకు తెచ్చుకున్నారు.వాటితోనే మూడు సినిమాలను త్వరగా పూర్తి చేయగలిగారు.

Telugu Bhakta Jayadeva, Durga Cinetone, Pashupatastra, Vizag Studio-Movie

మరో పౌరాణిక సినిమాను కూడా మొదలుపెట్టారు.అయితే షూటింగ్ కోసమని తీసుకొచ్చిన ఆ లైట్లకు అద్దె చెల్లించలేదు ఓనర్లు.దీనివల్ల కంపెనీ ఆ లైట్లను షూటింగ్ జరుగుతుండగానే తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయింది.

నిజానికి ఆ లైట్ల రెంటు కట్టగలిగే స్తోమత ఓనర్లకు ఉంది.కావాలనుకుంటే డబ్బు చెల్లించి వాటిని మళ్లీ వెనక్కి తెచ్చుకోగలిగే వారు కానీ ఆ పని చేయలేదు.

లైట్ లేకపోతే షూటింగ్ చేయడం కుదరదు కాబట్టి స్టూడియో మూత పడింది.అప్పట్లో ఈ సంగతి తెలిసి చాలామంది షాక్ అయ్యారు.

బహుశా సినిమాలు తీయడం వల్ల ఓనర్లకు ఎలాంటి లాభాలు రాకపోయి ఉండవచ్చు.అందుకే ఆసక్తి లేక ఈ స్టూడియో క్లోజ్ చేయడానికి వారు ఎక్కువ మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.

ఈ స్టూడియో ఓనర్లు ఆస్తిపరులే కాబట్టి దాని గురించి పెద్దగా పట్టించుకోలేదని కూడా అర్థం అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube