తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజకీయంగా, అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మాజీమంత్రి మేడ్చల్ నియోజకవర్గం టిఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి.( MLA Mallareddy ) ఎప్పటి నుంచో మల్లారెడ్డి పై అనేక అక్రమాలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి .
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) మల్లారెడ్డి పై ఎక్కువగా ఫోకస్ చేశారు.దీంతో ఆయన రేవంత్ కి అనుకూలంగా ప్రకటనలు చేశారు.
ఇక అప్పటి నుంచి మల్లారెడ్డి కాంగ్రెస్ లో చేరబోతున్నారనే ప్రచారం జరుగుతుంది.
తాజాగా మరోసారి మల్లారెడ్డి పార్టీ మారుతున్నారనే ప్రచారం మరింత జోరందుకుంది .దీనికి కారణం రేవంత్ రెడ్డి సలహాదారు వేం నరేందర్ రెడ్డిని( Vem Narender Reddy ) మల్లారెడ్డి కలవడంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది.దీనిపై మీడియా, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వెలువడటంతో వెంటనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసి , తాను తన కుమారుడు భద్ర రెడ్డి కాంగ్రెస్ లో చేరబోతున్నాం అనేది వట్టి పుకార్లు మాత్రమేనని ,
తాము బీఆర్ఎస్ లోనే( BRS ) ఉంటామని మల్లారెడ్డి క్లారిటీ ఇచ్చారు.అలాగే తన అల్లుడు , ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కి( MLA Marri Rajasekhar Reddy ) చెందిన కాలేజీ భవనాల కూల్చివేత అంశంపై మాత్రమే మాట్లాడేందుకు తాము రేవంత్ రెడ్డి సలహాదారు వేం నరేందర్ రెడ్డిని కలిసామని మల్లారెడ్డి క్లారిటీ ఇచ్చారు.వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మల్కాజ్ గిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు తన కుమారుడు సిద్ధంగా ఉన్నాడని మల్లారెడ్డి గతంలోనే ప్రకటించగా, దీని పై భద్ర రెడ్డి స్పందించారు.
తనకు పోటీ చేసే ఆలోచన లేదని బిఆర్ఎస్ అధిష్టానానికి తేల్చి చెప్పారు.
మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి హైదరాబాద్ శివార్లలో నిర్వహిస్తున్న రెండు కళాశాలల ఆవరణలోని కొన్ని నిర్మాణాలను రెండు రోజుల క్రితమే అధికారులు కూల్చివేశారు.దుండిగల్ లోని ఏరోనాటికల్ కళాశాల ఎం.ఎల్.ఆర్ ఐటిఎం కళాశాలలోని రెండు శాశ్వత భవనాలు , ఆరు తాత్కాలిక షెడ్లను చెరువు స్థలంలో అక్రమంగా నిర్మించారనే ఆరోపణలు ఉండడంతో అధికారులు వాటిని కూల్చివేశారు .దీనిపైనే మల్లారెడ్డి రేవంత్ రెడ్డి సలహాదారుతో భేటీ అయ్యారు.దీనిపై ఆయన పార్టీ మారుతున్నారనే వార్తలు తెరపైకి వచ్చాయి.