ప్రతి ఒక్కరికి కూడా లైఫ్ లో ఎన్నో కోరికలు తీర్చుకోవాలని ఉంటుంది.ఎన్నో రకాల కలలు కనడంతో పాటు వాటిని నెరవేర్చుకోవడానికి తెగ ప్రయత్నిస్తూ ఉంటారు.
అలా టాలీవుడ్ లో కూడా పలువురు స్టార్ సెలబ్రిటీలు కొన్ని రకాల కోరికలు కోరుకున్నప్పటికీ ఆ కోరికలు నెరవేర లేదట.ఇంతకీ ఆ స్టార్ హీరోలు ఎవరు వారి కోరికలు ఏంటి అన్న వివరాల్లోకి వెళితే.
దివంగత హీరో టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ( Superstar Krishna ) గురించి మనందరికీ తెలిసిందే.తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోగా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు సూపర్ స్టార్ కృష్ణ.
అయితే సూపర్ స్టార్ కృష్ణకు తన మనవడు గౌతమ్( Gautham ), కొడుకు సూపర్ స్టార్ మహేష్ బాబుతో ( superstar Mahesh Babu )కలిసి ఒక సినిమాలో నటించాలి అని కోరిక ఉండేదట.కానీ ఆ కోరిక ఇంకా నెరవేరకుండానే ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు.అలాగే టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కి తన కొడుకు అల్లు అర్జున్( Allu Arjun ) అలాగే అల్లుడు రామ్ చరణ్ ( Ram Charan )ఇద్దరు కలిసి ఒకే సినిమాలో నటించాలని కోరుకుంటున్నారట.అంతే కాకుండా వారిద్దరు కలిసి నటించే ఆ సినిమాకు తానే నిర్మాతగా వ్యవహరించాలని కోరిక అల్లు అరవింద్ కు ఉందట.
నా కోరిక ఎప్పుడు నెరవేడుతుందో ఏమో చూడాలి మరి.
అల్లు అర్జున్ రామ్ చరణ్ కాంబినేషన్ లో సినిమా వస్తే కనుక తప్పకుండా సినిమా హిట్ అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి( Megastar Chiranjeevi ) కూడా ఒక కోరిక ఉందట.అదేమిటంటే మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ అలాగే కూతురు క్లీంకార తో కలిసి ఒక సినిమాలో నటించాలని కోరుకుంటున్నారట మెగాస్టార్ చిరంజీవి.
దివంగత హీరో రెబల్ స్టార్ కృష్ణం రాజుకి ప్రభాస్ సినిమా హాలీవుడ్ లో విడుదల అవుతే చూడాలని కోరిక ఉందట.అంతేకాకుండా ప్రభాస్ కి పుట్టిన పిల్లలతో తన చేతులతో ఎత్తుకొని ఆడించాలని ఉందట.
ఆ కోరికలు తీరకుండానే రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణించారు.