గుడి కన్నా బడిని బాగుపరచుకోవడం మేలు:ప్రభుత్వ విప్ బీర్ల

యాదాద్రి భువనగిరి జిల్లా: గుడులను కట్టే దానికంటే బడులను బాగుచేసుకోవడం ద్వారానే భవిష్యత్తు తరాలు బాగుంటాయని ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య( Beerla Ilaiah ) అన్నారు.శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా( Yadadri Bhuvanagiri ) గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న మోత్కూరు పాత తాలూకా స్థాయి గ్రామీణ క్రీడోత్సవాలను ఆయన ప్రారంభించి మాట్లాడుతూ అనేక మంది పిల్లలు గ్రామీణ స్థాయిలోనే మట్టిలో మాణిక్యంలా దాగి ఉన్నారని,వారిని గుర్తించి సరైన శిక్షణ ఇస్తే దేశానికి భావి,భారత పౌరులను అందజేసిన వాళ్ళం అవుతామన్నారు.

 It Is Better To Improve The Tree Than The Temple: Govt Beerla Ilaiah , School,-TeluguStop.com

అలాంటిఉద్దేశంతోనే తన సోదరుడు,బీర్ల ఫౌండేషన్ వైస్ చైర్మన్,గుండాల స్కూలు పూర్వపు విద్యార్థి ఈరసరపు యాదగిరి గౌడ్ కలిసి చక్కటి ఆలోచనతో ఈ గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడానికి ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు.

బడి మౌలిక వసతుల కొరకు పది లక్షల రూపాయలను తన ఎమ్మెల్యే నిధుల నుండి కేటాయిస్తానని హామీ ఇచ్చారు.

క్రీడల ఇంచార్జ్ ఈరసరపు యాదగిరి గౌడ్ మాట్లాడుతూ నాలాంటి ఎన్నో వేల మందికి ఈ స్కూల్లో విద్యాబుద్ధులు నేర్పిన నా గురువులకు ఈ సందర్భంగా పాదాభివందనాలు తెలియజేస్తున్నానని,నేను చదువుకున్న ఈ బడిని( School ) బాగు చేయడానికి ముందు వరుసలో ఉన్నానని, గతంలో వర్షా కాలంలో స్కూల్లో ఉండడానికి వీలు లేకుండా బురదమయం అయితే తెలిసిన వెంటనే నా సొంత డబ్బులతో మొరం పోయించి స్కూల్ పిల్లల కాళ్లకు బురద అంటకుండా చూసుకున్నానని గుర్తు చేశారు.గత కొంతకాలంగా గుండాలలో క్రీడలు నిర్వహించకపోవడం గమనించి ఈ సంవత్సరం పూర్వపు విద్యార్థులు అందరి సహకారంతో క్రీడలు నిర్వహిస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి,ద్యాప కృష్ణారెడ్డి,తహసిల్దార్ జల కుమారి,ఎంపీడీవో దేవిక, ఎంపీపీ తాండ్ర అమరావతి,ఏలూరి రామిరెడ్డి,కోల్కొండ యాదగిరి,లింగాల భిక్షం, ఖలీల్,ఇమ్మడి దశరథ, పొన్నగాని నారాయణ గౌడ్,వంగూరి మల్లేష్, వివిధ గ్రామాల విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube