టిడిపి, జనసేన పార్టీలు పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో రెండు పార్టీలు సీట్ల సర్దుబాటు విషయమై ఇప్పటికే చర్చించుకున్నాయి.అభ్యర్థుల ప్రకటన చేసేందుకు సిద్ధమవుతున్న సమయంలో బిజెపి నుంచి టిడిపికి వర్తమానం రావడంతో, హుటాహుటిన చంద్రబాబు( Chandrababu Naidu ) ఢిల్లీకి వెళ్లారు.
బిజెపి కూడా తమతో కలిసి వచ్చేందుకు సిద్ధమవుతుందనే సంకేతాలు వెలువడటంతో అభ్యర్థుల జాబితా ప్రకటనను టిడిపి, జనసేనలు వాయిదా వేసుకున్నాయి.కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో( Amit Shah ) టిడిపి జాతియ అధ్యక్షుడు చంద్రబాబు పొత్తుల అంశంపై చర్చించారు.
ఇక తర్వాత వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్( CM Jagan ) ఢిల్లీకి వెళ్లడం, ప్రధాని మోదీతో( PM Modi ) చర్చించడం జరిగాయి.అయితే జగన్ ఏ అంశాలపై ప్రధాని మోది తో చర్చించారో తెలియదు గాని, టిడిపితో పొత్తు విషయంలో బిజెపి తమ నిర్ణయాన్ని ఇంకా ప్రకటించలేదు.
దీంతో బీజేపీ( BJP ) పొత్తుల విషయంలో ఏ నిర్ణయం తీసుకుందో తెలియక టిడిపి జనసేనలు సందిగ్ధం లో పడ్డాయి.బిజెపిని కాదని తమ పార్టీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తే బిజెపి అగ్ర నేతల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందనే భయమూ రెండు పార్టీల అధినేతల్లో కనిపిస్తోంది.

మరోవైపు చూస్తే ఏపీలో ఎన్నికలకు( AP Elections ) సమయం దగ్గర పడుతుంది .త్వరగా అభ్యర్థుల జాబితాను ప్రకటించి జనాల్లోకి వెళ్ళేందుకు టిడిపి జనసేన లు( TDP Janasena ) ప్లాన్ చేసుకున్నా… బిజెపి నిర్ణయం తెలియక ముందుకు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నాయి.అసలు పొత్తుల విషయంలో బిజెపి మనసులో ఏముందో ఎవరికి తెలియడం లేదు.అయితే ఏపీ బీజేపీ నేతలు మాత్రం టిడిపి జనసేనతో కలిసి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.
కానీ ఈ విషయంలో బిజెపి కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉండడంతో ఈ పొత్తుల విషయంలో టిడిపి జనసేన ఏ విధంగానూ ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది.

అయితే గతంలో టిడిపి బిజెపితో పొత్తు పెట్టుకుని ఆ తరువాత బిజెపి అధినేతలపై విమర్శలు చేసి, పొత్తు రద్దు చేసుకున్న విషయాన్ని గుర్తు చేసుకుంటున్న బిజెపి అగ్ర నేతలు మరోసారి ఆ విధంగా జరగకుండా వ్యవహాత్మకంగా నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు.దీనిపై ఒక అంచనాకు వచ్చాక పొత్తులపై ముందుకు వెళ్లాలని బిజెపి అగ్ర నేతలు చూస్తున్నారు.ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) బిజెపి అగ్ర నేతల అపాయింట్మెంట్ కోరినా వారు ఇవ్వకపోవడం, పొత్తుల విషయంలో సరైన క్లారిటీ ఇవ్వకపోవడంతో, ఈ విషయంలో ఏం చేయాలో తెలియని గందరగోళ పరిస్థితుల్లో టీడీపీ జనసేనలు ఉన్నాయి.