స్టార్ హీరో బాలయ్య అనిల్ రావిపూడి డైరెక్షన్ లో నటించిన భగవంత్ కేసరి( Bhagavanth Kesari ) దసరా పండుగ కానుకగా విడుదలై థియేటర్లలో హిట్ గా నిలిచింది.ఈ సినిమాకు పోటీగా లియో, టైగర్ నాగేశ్వరరావు విడుదలైనా కలెక్షన్ల విషయంలో బాలయ్య ( Balakrishna ) సినిమానే పైచేయి సాధించింది.
ఓటీటీలో కూడా అదరగొట్టిన ఈ సినిమా తాజాగా బుల్లితెరపై జీ తెలుగు( Zee Telugu ) ఛానల్ లో ప్రసారమైంది.ఈ సినిమాకు బుల్లితెరపై 7.69 రేటింగ్ వచ్చింది.
టీవీలలో సినిమాలను చూసే ప్రేక్షకుల సంఖ్య ఊహించని స్థాయిలో తగ్గిన నేపథ్యంలో ఇలాంటి సమయంలో 7.69 రేటింగ్ అంటే మంచి రేటింగ్ అనే చెప్పాలి.కాజల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా బాలయ్య పెంచిన కూతురు పాత్రలో శ్రీలీల( Sreeleela ) నటించారు.
భగవంత్ కేసరి రిలీజ్ తర్వాత శ్రీలీలకు సైతం చెప్పుకోదగ్గ స్థాయిలో హిట్ దక్కలేదు.శ్రీలీల కెరీర్ ప్రస్తుతం ఆశించిన విధంగా లేదు.
బాలయ్యకు భగవంత్ కేసరి ఇచ్చిన సక్సెస్ జోష్ అంతాఇంతా కాదు.ఈ సినిమా పూర్తైన వెంటనే బాలయ్య బాబీ( Director Bobby ) మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు.బాలయ్య తను హీరోగా తెరకెక్కే సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారని తెలుస్తోంది.బాలయ్య మాస్ పల్స్ పట్టాడని అందుకే ప్రతి సినిమా హిట్ అవుతోందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.
మాస్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న బాలయ్య కథనం విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని అందువల్లే బాలయ్యకు వరుసగా భారీ విజయాలు దక్కుతున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.బాలయ్య అఖండ 2( Akhanda 2 ) సినిమా షూట్ తో త్వరలో బిజీ కానున్నారని సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతోంది.భగవంత్ కేసరి మూవీకి సీక్వెల్ కూడా కావాలని ప్రేక్షకులు కోరుకుంటుండగా ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందో లేదో చూడాల్సి ఉంది.