రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని స్వయంభు వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద హైమాస్ లైట్లను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జిల్లా బాల్రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభించారు.బాల్ రెడ్డి చొరువతో ప్రభుత్వ నిధుల ద్వారా హైమాస్ లైట్లను స్థాపించడంతో ఆలయ కమిటీ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా బాల్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో
మున్ముందు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ముస్తాబాద్ మండలాన్ని అభివృద్ధి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు గజ్జల రాజు ఎంపిటిసి శ్రీనివాస్ గౌడ్,ఆలయ కమిటీ సభ్యులు,యూత్ కాంగ్రెస్, సోషల్ మీడియా మండల అధ్యక్షులు రంజాన్ నరేష్ ఎదునూరి భానుచందర్,పట్టణ ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి సీనియర్ నాయకులు బాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు