రైతు ప్రాణం పోతుంటే సంకెళ్లు వేస్తారా: ధరావత్ రాజు నాయక్

యాదాద్రి భువనగిరి జిల్లా: లగచర్ల పులిచర్లకుంట తండాకు చెందిన హీర్య నాయక్ మా భూములు మాకు ఇవ్వమన్నందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మా లంబాడీలపై పగపట్టిందని,ఏదోరకంగా భయభ్రాంతులకు గురి చేసి భూములను తీసుకోవాలని తన అన్న తిరుపతిరెడ్డితో ప్రైవేట్ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని లంబాడి తండాలపై అక్కడి గిరిజన లంబాడీలపై భయభ్రాంతులకు గురిచేస్తూ,శాంతి యుతంగా నిర్వహిస్తున్న తమ పోరాటాన్ని ఏదో రకంగా హింస మార్గంలో వచ్చేటట్టు చేసి వారిని భయభ్రాంతులకు గురిచేసి,పోలీసులు కేసులు పెట్టించి,పోలీస్ స్టేషన్లో రాత్రి మొత్తం చిత్రహింసలు గురిచేసి, విపరీతంగా కొట్టి వారిని భయపెట్టి జైల్లో పెట్టి హింసించి వాళ్ళ భూములు లాక్కోవాలని చేస్తున్న ప్రయత్నాన్ని లంబాడి హక్కుల పోరాట సమితి తీవ్రంగా వ్యతిరేకిస్తుందని లంబాడి హక్కుల పోరాట సమితి యాదాద్రి భువనగిరి జిల్లా జిల్లా అధ్యక్షుడు ధరావత్ రాజు నాయక్ అన్నారు.

 If The Farmer Life Is Lost Will He Be Shackled Dharawat Raju Naik, Farmers, ,dha-TeluguStop.com

రాష్ట్ర ప్రభుత్వం అంటే ఎస్సీ,ఎస్టీ,బీసీ వర్గాల ప్రజలకు అండగా ఉండాలని,కానీ, భయభ్రాంతులకు గురిచేసి వారి ప్రాణాలతో చెలగాటం మాడడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.

లగచర్ల రైతుపై ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టిందని,హార్ట్ ఎటాక్ వస్తే హడావుడిగా ఆసుపత్రికి తీసుకెళ్లాలి కానీ,సంకెళ్లు వేసుకొని దవఖానకు తీసుకెళ్లడం ఈ ప్రభుత్వం తీరుకు అద్దం పడుతుందన్నారు.

మానవత్వాన్ని మరిచిపోయి ఒక మృగంలాగా ప్రవర్తిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని, లంబాడి రైతు హిర్యా నాయక్ కు ఏమన్నా జరిగితే పూర్తి బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వహించాలని, వెంటనే లంబాడి రైతులను బేషరతుగా విడుదల చేయాలని లంబాడి హక్కుల పోరాట సమితి డిమాండ్ చేస్తుందన్నారు.

ఫార్మా విలేజ్ పేరుతో జీవోలను జారీ చేసిన ప్రభుత్వం ఆ జీవులను వెనక్కి తీసుకున్నది,కనుక వెంటనే లగచర్ల బాధిత లంబాడి రైతులను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube