గవర్నర్ కోటా ఎమ్మెల్సీల వివాదం పిటిషన్ పై ఇవాళ తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది.ఇప్పటికే ఈ పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే.
గతంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ పేర్లను సిఫార్సు చేసింది.అయితే అప్పటి ప్రభుత్వం చేసిన సిఫార్సును గవర్నర్ తమిళిసై సౌందర రాజన్( Tamilisai Soundararajan ) తిరస్కరించారు.
దీంతో ఎమ్మెల్సీ అభ్యర్థులు కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్ కుమార్ లు హైకోర్టును ఆశ్రయించారు.
ఈ క్రమంలోనే తమ కేసు తేలేంత వరకు కొత్తగా ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేయకుండా స్టే ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు యథాతథ స్థితి కొనసాగించాలని గతంలో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు కొత్త ఎమ్మెల్సీలతో ప్రమాణస్వీకారం చేయించవద్దని ఆదేశాలు జారీ చేసింది.
కాగా ఈ పిటిషన్ పై హైకోర్టు( High Court ) ఇవాళ మరోసారి విచారణ జరపనుంది.