ఉమ్మడి అనంతపురం జిల్లా హిందూపురం( Hindupuram )లో వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ ప్రభంజనం సృష్టించాలని అధికార పార్టీ వైసీపీ భావిస్తోంది.అయితే స్థానిక నేతలు మాత్రం గ్రూపు రాజకీయాలతో పార్టీని బలహీనపరుస్తారు.
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి( Peddireddy Ramachandra Reddy ) ఇంఛార్జ్ గా ఉన్న కొందరు నేతల తీరులో మార్పు రావడం లేదని తెలుస్తోంది.ఈ క్రమంలో ఆయన ఎంత సర్దిచెబుతున్నా వైసీపీ నేతలు ఒక్కతాటిపైకి రావడం లేదు.
మరోవైపు హిందూపురం నియోజకవర్గంలో హ్యాట్రిక్ కొట్టాలని టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna ) వ్యూహాలు రచిస్తున్నారు.అయితే ఈసారి ఎన్నికల్లో బాలయ్యను ఎలాగైనా ఓడించి వైసీపీ జెండాను ఎగురవేయాలని పార్టీ అధిష్టానం భావిస్తుంది.ఈ క్రమంలోనే కీలక నేత పెద్దిరెడ్డికి ఇంఛార్జ్ బాధ్యతలను అప్పగించింది.కానీ వైసీపీ నేతల తీరు ప్రస్తుతం పార్టీ హైకమాండ్ కు తలనొప్పిగా మారిందని సమాచారం.