వన్ ప్లస్ 12 సిరీస్( OnePlus 12 ) లో భాగంగా వన్ ప్లస్ 12, వన్ ప్లస్ 12R స్మార్ట్ ఫోన్లు( OnePlus 12R ) ఇటీవలే విడుదలయ్యాయి.ఇప్పటికేవన్ ప్లస్ 12 సేల్ ప్రారంభం కాగా.
రేపటి నుంచి వన్ ప్లస్ 12R హ్యాండ్ సెట్ సెల్ ప్రారంభం కానుంది.ఈ స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన స్పెసిఫికేషన్ వివరాలతో పాటు ధర వివరాలను తెలుసుకుందాం.
వన్ ప్లస్ 12R స్మార్ట్ ఫోన్:
ఈ ఫోన్ 6.78 అంగుళాల అమోలెడ్ LTPO డిస్ ప్లే తో ఉంటుంది.120Hz రిఫ్రెష్ రేట్,4500 నిట్స్ గరిష్ట బ్రైట్ నెస్, 360Hz టచ్ శాంప్లింగ్ రేట్, 1264*2780 పిక్సెల్ రిజల్యూషన్ తో ఉంటుంది.ఆక్టా కోర్ 4nm స్నాప్ డ్రాగన్ 8జెన్ 2SoC చిప్ సెట్ తో వస్తుంది.5500 mAh బ్యాటరీ సామర్థ్యం తో 100w సూపర్ వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో ఉంటుంది.

50 ఎంపీ సోనీ IMX 890 ప్రధాన కెమెరా, 8ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపీ మాక్రో లెన్స్, 16ఎంపీ ఫ్రంట్ కెమెరాతో ఉంటుంది.అట్మాస్ సపోర్ట్ తో స్టీరియో స్పీకర్లతో ఉంటుంది.కార్నింగ్ గొరెల్లా గ్లాస్ 2 రక్షణను పొందుతుంది.
అల్యూమినియం మెటల్ ఫ్రేమ్, వెనుక గ్లాస్ ను కలిగి ఉంటుంది.

ఈ స్మార్ట్ ఫోన్ ధర విషయానికి వస్తే.8GB RAM+128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.39999 గా ఉంది.16GB RAM+256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.45999 గా ఉంది.ఈ స్మార్ట్ ఫోన్ పై రూ.1000 ప్రారంభ డిస్కౌంట్ ఆఫర్ కూడా ఉంది.డిస్కౌంట్ ఆఫర్ పొందాలంటే.ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు, వన్ కార్డు ద్వారా కొనుగోలు చేయాలి.అంతేకాదు ఆరు నెలల పాటు గూగుల్ వన్ సబ్ స్క్రిప్షన్, మూడు నెలల పాటు యూట్యూబ్ ప్రీమియం( YouTube Premium ) సబ్ స్క్రిప్షన్ పొందవచ్చు.ఈ స్మార్ట్ ఫోన్ ఫిబ్రవరి 6 మధ్యాహ్నం 12 గంటల నుంచి కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంటుంది.సేల్ ప్రారంభం అయిన 24 గంటల వ్యవధిలోగా వన్ ప్లస్ అధికారిక వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేస్తే రూ.4999 విలువైన బడ్స్ Z2( OnePlus Buds Z 2 ) ను ఉచితంగా పొందవచ్చు.