US Presidential Elections 2024 : అమెరికా అధ్యక్ష ఎన్నికలు .. సౌత్ కరోలినా డెమొక్రాటిక్ ప్రైమరీలో బైడెన్ విజయం

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు( US Presidential Elections ) సంబంధించి శనివారం జరిగిన సౌత్ కరోలినా డెమొక్రాటిక్ ప్రైమరీలో అధ్యక్షుడు జో బైడెన్ విజయం సాధించారు.దాదాపు 55 మంది డెలిగేట్‌లు ఈ పోటీలో వున్నప్పటికీ, తొలి నుంచి బైడెన్‌దే విజయమని అంతా భావించారు.

 Us Presidential Election Joe Biden Wins South Carolina Democratic Primary-TeluguStop.com

అనుకున్నట్లుగానే అధ్యక్షుడే ఈ ప్రైమరీలో గెలుపొందారు.మారియన్ విలియమ్సన్, డీన్ ఫిలిప్స్‌లు బైడెన్‌( Joe Biden )కు గట్టి పోటీనిచ్చారు.

సౌత్ కరోలినా ప్రైమరీలో విజయం సాధించినప్పుడు.బైడెన్ లాస్ ఏంజెల్స్‌లో నిధుల సేకరణ కార్యక్రమంలో వున్నారు.

Telugu Donald Trump, Joe Biden, Republicans, Carolina, Presidential-Telugu NRI

దీనిపై ఆయన స్పందిస్తూ.‘‘ 2020 అధ్యక్ష ఎన్నికల్లో సౌత్ కరోలినా( South Carolina ) ఓటర్లు మా ప్రచారానికి కొత్త రూపు తీసుకొచ్చారు.ప్రెసిడెన్సీని గెలుచుకునే మార్గంలో మమ్మల్ని నడిపించారు.ఇప్పుడు 2024లోనూ సౌత్ కరోలినా ప్రజలు మరోసారి అదే రకమైన తీర్పునిచ్చారు.ట్రంప్‌ను ఓడిపోయేలా చేయడానికి, మమ్మల్ని నడిపించారనడంలో నాకు ఎలాంటి సందేహం లేదు ’’ అని బైడెన్ ఓ ప్రకటనలో అన్నారు.బైడెన్ శనివారం నిధుల సేకరణ కార్యక్రమానికి వెళ్లేముందు డెలావేర్‌లోని విల్మింగ్టన్‌లో తన రీ ఎలక్షన్ ప్రచార కార్యాలయం వద్ద ఆగి మీడియాతో మాట్లాడారు.

ఇది కేవలం ప్రచారం కాదని, దేశ ప్రయోజనాల కోసం ఈ ప్రచారాన్ని మనం కోల్పోలేమన్నారు.ఏం జరుగుతుందో అమెరికన్లు అర్ధం చేసుకుంటారని బైడెన్ పేర్కొన్నారు.

కాగా.అమెరికా సార్వత్రిక ఎన్నికల్లో సౌత్ కరోలినాలో తొలి నుంచి రిపబ్లికన్లు( Republicans ) ఆధిపత్యం వహిస్తూ వస్తున్నారు.జిమ్మీకార్టర్ (1976లో) ఇక్కడ గెలిచిన చివరి డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్ధి.ఇప్పటికే జనవరి 23న న్యూహాంప్‌షైర్‌ డెమొక్రాటిక్ ప్రైమరీ( New Hampshire Democratic Primary )లో బైడెన్ గెలుపొందారు.

అయితే బ్యాలెట్‌లో లిస్ట్ చేయలేదు, కానీ మద్ధతుదారులు మాత్రం ఆయన పేరును వ్రాసినట్లు సమాచారం.

Telugu Donald Trump, Joe Biden, Republicans, Carolina, Presidential-Telugu NRI

మరోవైపు.అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి తలపడుతున్న జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్‌ల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతోంది.వీలు చిక్కినప్పుడల్లా బైడెన్ పాలనపై విమర్శలు గుప్పిస్తున్నారు ట్రంప్( అటు బైడెన్ కూడా అదే స్థాయిలో ఘాటుగా బదులిస్తున్నారు.

తాజాగా బైడెన్‌పై మండిపడ్డారు డొనాల్డ్ ట్రంప్ ( Donald Trump )పొలిటికో ప్రకారం.అధ్యక్షుడు ఇటీవల ట్రంప్ గురించి క్లోజ్డ్ డోర్ సంభాషణలో ఘాటు వ్యాఖ్యలు చేశారు.

దానికి ప్రతిస్పందనగా.“BIDEN JUST CALLED ME A SICK F-WORD ’’ అనే శీర్షికతో తన నిధుల సేకరణ ఈమెయిల్‌లో మద్ధతుదారులను ఉద్దేశించి ట్రంప్ రాశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube