గుంటూరు కారం కుర్చీ మడతబెట్టి సాంగ్ ఖాతాలో అరుదైన రికార్డ్.. ఏం జరిగిందంటే?

కొన్ని సినిమాలు టాక్ తో ఏ మాత్రం సంబంధం లేకుండా కలెక్షన్ల విషయంలో సంచలన విజయాలను సొంతం చేసుకుంటాయి.అలా టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్లను సాధించిన సినిమాలలో గుంటూరు కారం ఒకటి.

 Guntur Kaaram Kurchi Madathabetti Song Rare Record Details Here Goes Viral In S-TeluguStop.com

ఇప్పటికీ చెప్పుకోదగ్గ స్థాయిలో థియేటర్లలో ఈ సినిమా ప్రదర్శితమవుతోంది.ఈ సినిమాలోని కుర్చీ మడతబెట్టి సాంగ్( Kurchi Madathapetti ) ఎంత పెద్ద హిట్టైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

అయితే గుంటూరు కారం కుర్చీ మడతబెట్టి సాంగ్ ఖాతాలో అరుదైన రికార్డ్ చేరింది.ఇన్ స్టాగ్రామ్ లో ఈ సాంగ్ కు 10 లక్షల కంటే ఎక్కువ రీల్స్ వచ్చాయని హారిక హాసిని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.

Telugu Guntur Kaaram, Mahesh Babu, Rajamouli, Sreeleela, Trivikram-Movie

ఈ మధ్య కాలంలో ఏ సాంగ్ కు ఈ స్థాయిలో రీల్స్ తో రెస్పాన్స్ రాలేదని తెలుస్తోంది.మొదట కుర్చీ మడతబెట్టి లిరిక్స్ విషయంలో నెగిటివ్ కామెంట్లు వినిపించినా ఆ నెగిటివ్ కామెంట్లు చేసిన వాళ్లే ఇప్పుడు పాజిటివ్ గా స్పందిస్తున్నారు.గుంటూరు కారం మూవీ( Guntur Kaaram ) కలెక్షన్ల విషయంలో ఒకింత గందరగోళం నెలకొంది.మేకర్స్ ప్రకటిస్తున్న కలెక్షన్లకు, అధికారిక కలెక్షన్లకు ఏ మాత్రం పొంతన లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

గుంటూరు కారం రిలీజ్ కావడంతో మహేష్ బాబు( Mahesh Babu ) తర్వాత ప్రాజెక్ట్ లపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.రాజమౌళి మహేష్ సినిమా విషయంలో ఏ మాత్రం రాజీ పడటం లేదు.

Telugu Guntur Kaaram, Mahesh Babu, Rajamouli, Sreeleela, Trivikram-Movie

మహేష్ జక్కన్న కాంబో( Mahesh Babu Rajamouli ) మూవీ 2026 సంవత్సరం ఉగాది కానుకగా రిలీజ్ కానుందని ప్రచారం జరుగుతోంది.మహేష్ జక్కన్న కాంబో మూవీలో బాలీవుడ్ నటులతో పాటు హాలీవుడ్ నటులకు కూడా ప్రాధాన్యత ఉండనుందని తెలుస్తోంది.మహేష్ రాజమౌళి కాంబో మూవీ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని భోగట్టా.మహేష్ భవిష్యత్తు సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube