టీఎస్పీఎస్సీ( TSPSC ) ప్రక్షాళనకు రంగం సిద్ధం అయిందని తెలుస్తోంది.ఈ మేరకు టీఎస్పీఎస్సీ ఛైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి( Former DGP Mahender Reddy ) పేరు ఖరారు అయినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్( Tamilisai Soundararajan ) ఆమోదం కోసం ప్రభుత్వం సిఫారసు చేసింది.ఈ మేరకు టీఎస్పీఎస్సీ ఫైల్ రాజ్ భవన్ కు చేరింది.
గవర్నర్ ఆమోద ముద్ర వేయగానే అధికారికంగా ప్రకటించనున్నారు.
రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు భరోసా కల్పించే విధంగా టీఎస్పీఎస్సీ పాలకమండలిని సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే.ఛైర్మన్ తో పాటు పది మంది సభ్యుల కోసం ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించింది.ఇందులో ఛైర్మన్ పదవికి కోసం యాభైకి పైగా అప్లికేషన్లు దాఖలు కాగా సభ్యుల కోసం 321 దరఖాస్తులు వచ్చాయి.
ఈ క్రమంలోనే టీఎస్పీఎస్సీ ఛైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియామకం అవుతారని సమాచారం.