మామూలుగా సినిమా హీరోలను కొందరు అభిమానించేవారు ఉంటే మరికొందరు దేవుళ్ళలాగా పూజిస్తూ వారి కోసం పిచ్చిపిచ్చి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు.అయితే కొన్ని కొన్ని సార్లు హీరోలపై అభిమానులకు ఉన్న అభిమానం మితిమీరుతూ ఉంటుంది.
అది సెలబ్రిటీలకు ( celebrities )ఇబ్బంది కలిగించే విధంగా కూడా ఉంటుంది.జన్మనిచ్చిన తల్లిదండ్రుల కంటే హీరోలే ఎక్కువ అన్నట్టుగా ప్రవర్తిస్తుంటారు.
అభిమాన హీరో సినిమాల రికార్డుల మాయలో పడి తమ విలువైన సమయాన్ని, డబ్బుని కోల్పోతూ ఉంటారు.అయితే అభిమానులు చేసే తప్పులను ఎత్తిచూపుతో వారిని మందలించే హీరోలు చాలా అరుదుగా ఉంటారు.
అలాంటి వారిలో బాలకృష్ణ కూడా ఒకరు.
బాలయ్య బాబు( Balayya Babu )కి కోపం వస్తే అభిమాని అని కూడా చూడకుండా కొట్టడానికి సైతం వెనకాడరు.అలా గతంలో చాలామంది పై బాలయ్య బాబు చేయి చేసుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.ఇకపోతే తాజాగా కూడా బాలయ్య బాబు కొందరిపై సీరియస్ అయ్యారు.
బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి ( Veerasimha Reddy ) గత ఏడాది సంక్రాంతికి విడుదలై ఘన విజయం సాధించింది.ఈ చిత్రం ఏడాదిపాటు కొన్ని థియేటర్లలో ప్రదర్శితమైంది.
ఈ సందర్భంగా దీనిని సెలెబ్రేట్ చేసుకోవాలని భావించిన కొందరు అభిమానులు.బాలయ్యని కలిశారట.
వీరసింహారెడ్డి వన్ ఇయర్ సెలెబ్రేషన్స్( One Year Celebrations ) చేయాలనుకుంటున్నామని, దానికోసం ప్రత్యేక బైట్ ఇవ్వాలని బాలకృష్ణని అభిమానులు కోరారట.అయితే బాలయ్య మాత్రం ఇలాంటి రికార్డులు చూపించడానికి ఎందుకు తాపత్రయ పడుతున్నారంటూ వారికీ ఫుల్ గా క్లాస్ పీకారట.ఆ సినిమా విజయం సాధించిందని, ప్రేక్షకులు ఆదరించారని అందరికీ తెలుసు.ఇప్పుడు ప్రత్యేకంగా సెలెబ్రేట్ చేసి చెప్పుకోవాల్సిన అవసరం లేదు.అభిమానానికి కూడా హద్దు ఉండాలని హితవు పలికారట.సెలెబ్రేషన్స్ పేరుతో సమయం, డబ్బు వృధా చేసే అభిమానుల విషయంలో బాలకృష్ణ వ్యవహరించిన తీరుపై ప్రశంసలు కురుస్తున్నాయి.
కొందరు పొగరు అంటూ బాలకృష్ణ పై నెగిటివ్గా కామెంట్స్ చేస్తుండగా ఇంకొందరు అది ప్రేమ.ప్రేమ ఉంది కాబట్టే అలా మందలించి మంచిగా నడుచుకోమని చెప్పారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.