తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు( Chandrababu naidu ) గురువారం గుడివాడ నియోజకవర్గంలో భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై సీఎం జగన్ పై స్థానిక వైసీపీ నాయకులపై విమర్శల వర్షం కురిపించారు.
ఎన్నికల సమయంలో ఓ మోసగాడు ముద్దులు పెట్టుకుంటూ వచ్చాడు.ప్రజల జీవితాల్లో మార్పు ఏమైనా వచ్చిందా.? నిత్యావసరాల ధరలు పెరిగిపోయాయి.కరెంటు చార్జీలు, పెట్రోల్.
డీజిల్ ధరలు పెంచేయడం జరిగింది.మందు రేట్లు కూడా పెంచేశారు.
ఈ ప్రభుత్వం వచ్చాక బాదుడే బాదుడు.పేదవాడు పండుగ కూడా చేసుకొని పరిస్థితి దాపరించింది.
ఈ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు నష్టపోయారు.ఆఖరికి చెత్త మీద కూడా పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రి అని విమర్శించారు.
ఇంటి పన్ను కూడా పెంచేశారు.ఆర్టీసీ రేట్లు పెంచేశారు.
ఇలాగ అన్ని పెంచి మీకు పది రూపాయలు ఇచ్చి.మీ దగ్గర నుండి 100 రూపాయలు దోచేసుకుంటున్నారు అని వ్యాఖ్యానించారు.
ఇది దోపిడీ ప్రభుత్వం తప్ప మరొకటి కాదని అన్నారు.
ఈ క్రమంలో ప్రశ్నిస్తుంటే కేసులు పెడుతున్నారు.అందరూ ధైర్యంగా ఉండండి ఇష్టానుసారంగా వ్యవహరించే వారికి వడ్డీతో సహా చెల్లిస్తాం.ఈ క్రమంలో సుపరిపాలన అంటే పేదవాడికి ఖర్చులు తగ్గించి ఆదాయం పెంచి.
వాళ్లను ఆదుకునేది సరైన ప్రభుత్వం.ఇది పేదల ప్రభుత్వం కాదు… పేదల రక్తం తాగే ప్రభుత్వం.
ఆనాడే జగన్( Jagan Mohan Reddy ) అధికారంలోకి వస్తే పోలవరం, అమరావతి ఆగిపోతుందని ముందుగానే హెచ్చరించాను అంటూ చంద్రబాబు సంచలన స్పీచ్ ఇచ్చారు.గుడివాడ అంటే మహానుభావులు పుట్టిన గడ్డ.
తొలిసారి ఎన్టీఆర్( NTR ) ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గం నుండే గెలిచారు.ఆత్మగౌరవం నినాదంతో తెలుగువారి సత్తా చూపిన వ్యక్తి పుట్టిన గడ్డ గుడివాడ.
ఎన్టీఆర్ అంటే తెలుగు పౌరుషం, సంక్షేమం, బూతులు మాట్లాడే వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి.ఎదురొస్తే తొక్కుకుంటూ పోయే పార్టీ తెలుగుదేశం.
టిడిపి జనసేన గెలుపు అన్ స్టాపబుల్ అని గుడివాడ సభలో చంద్రబాబు వ్యాఖ్యానించారు.