చట్టవిరుద్ధంగా మత్తు మందుల సిఫారసు.. సింగపూర్‌లో భారత సంతతి వైద్యుడిపై సస్పెన్షన్ వేటు

చట్టవిరుద్ధంగా రోగులకు మత్తుమందులను సూచిస్తున్నాడన్న అభియోగాలపై సింగపూర్‌కు చెందిన డిసిప్లినరీ ట్రిబ్యునల్( Disciplinary Tribunal ) భారత సంతతికి చెందిన డాక్టర్‌పై సస్పెన్షన్ వేటు వేసింది.నిందితుడిని డాక్టర్ మణీందర్ సింగ్ షాహిగా( Dr.

 Indian Origin Doctor Suspended By Singapore Tribunal For Improperly Prescribing-TeluguStop.com

Maninder Singh Shahi ) గుర్తించారు.అతనికి 35 సంవత్సరాలకు పైగా అనుభవంతో పాటు దశాబ్ధానికి పైగా క్లినిక్ నడుపుతున్నట్లు ఛానెల్ న్యూస్ ఏషియా తెలిపింది.

షాహి.తన రోగులలో ఏడుగురికి మత్తుమందులను సిఫారసు చేసినట్లు దర్యాప్తులో తేలింది.ఈ నేరానికి గాను మణీందర్ షాహిని మూడేళ్ల పాటు మెడికల్ ప్రాక్టీస్ నుంచి సస్పెండ్ చేసింది ట్రిబ్యునల్.

35 ఏళ్ల అనుభవం వున్నప్పటికీ రోగికి అలాంటి మందులను పదే పదే సూచించడానికి గల కారణాలను నమోదు చేయడంలోనూ మణీందర్ విఫలమైనట్లు పేర్కొంది.మంగళవారం విడుదల చేసిన తీర్పుకు సంబంధించి ముగ్గురు సభ్యుల ధర్మాసనం మణీందర్ సస్పెన్షన్‌పై సింగపూర్ మెడికల్ కౌన్సిల్( Singapore Medical Council ) (ఎస్ఎంసీ) సిఫారసులను ఆమోదించింది.అయితే ప్రాసిక్యూషన్‌లో ఆలస్యం కారణంగా శిక్ష తగ్గించాలని డాక్టర్ తరపు లాయర్ చేసిన విజ్ఞప్తిని ధర్మాసనం తిరస్కరించింది.

Telugu Drmaninder, Marineparade, Singapore, Zolfidem, Zopiclone-Telugu NRI

డాక్టర్ మణీందర్ సింగ్ .మెరైన్ పరేడ్ సెంట్రల్‌లో( Marine Parade Central ) వున్న 81 ఫ్యామిలీ క్లినిక్‌లో ప్రాక్టీస్ చేశారు.అప్పటి నుంచి దానిని లెగసీ క్లినిక్‌గా పేరు మార్చినట్లు నివేదిక పేర్కొంది.2002 నుంచి 2016 వరకు తన చర్యలకు సంబంధించి 14 అభియోగాలపై ట్రిబ్యునల్ ముందు మణీందర్ తన నేరాన్ని అంగీకరించాడు.బెంజోడియాజిపైన్స్, జోపిక్లోన్, జోల్ఫిడెమ్‌లను అతను తన రోగులకు సూచించినట్లు నివేదిక వెల్లడించింది.ఈ మందులను నిద్రలేమి , ఆందోళన వంటి సమస్యలకు ఉపయోగిస్తారు.డాక్టర్ సింగ్ ఈ మందులను బాధిత రోగులకు ఏడేళ్ల నుంచి 13 సంవత్సరాల 8 నెలల వరకు సూచించారు.ఓ రోగి దాదాపు 300 సార్లకు పైగా డాక్టర్ మణీందర్ సింగ్‌ను సంప్రదించినట్లు నివేదిక పేర్కొంది.

Telugu Drmaninder, Marineparade, Singapore, Zolfidem, Zopiclone-Telugu NRI

ఎస్ఎంసీ నైతిక నియమావళి, మార్గదర్శకాల ప్రకారం.వైద్యులు ఈ మందులను అడపాదడపా లేదంటే రెండు నుంచి నాలుగు వారాల మధ్య స్వల్పకాలిక ఉపశమనం కోసం సూచించాలి.సాధ్యమైన చోట వారు దీర్ఘకాలిక బెంజోడియాజిపైన్ ప్రిస్క్రిప్షన్‌లను పరిమితం చేయాల్సిన అవసరం వుందని నివేదిక పేర్కొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube