ఎయిమ్స్ మెడికల్ సిబ్బంది నిర్వాహకం

యాదాద్రి భువనగిరి జిల్లా: బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రి సిబ్బంది నిర్వాహకం చూస్తుంటే తెలుగు డబ్బింగ్ సినిమా సింగం 3 గుర్తుకు వస్తుంది.ఆ సినిమాలో ఆస్ట్రేలియా నుండి విలన్ మెడికల్ వ్యర్ధాలను ఇండియాలో డంప్ చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతుంటే హీరో దానిపై జరిపే పోరాటమే మొత్తం సినిమా ఇతివృత్తం.

 Bibinagar Aiims Hospital Staff Dumping Medical Wastages At Residential Places, B-TeluguStop.com

అది రీల్ సినిమా అయితే ఎయిమ్స్ యాజమాన్యం చేసేది రియల్ సినిమా అంటున్నారు బీబీనగర్ మండలం రహీంఖాన్ గూడెం లెప్రసీ కాలనీ వాసులు.ప్రజల ప్రాణాలు నిలిపేందుకు ఉపయోగించాల్సిన మెడికల్ కిట్లను ఎక్స్ పైయిరీ ఆయ్యే వరకు వాడకుండా,అలాగే ఉపయోగించిన మెడికల్ వ్యర్ధాలను జన జీవనానికి దూరంగా డంప్ చేయకుండా జనావాసాల మధ్యలో నిర్లక్ష్యంగా డంప్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పీర్లగుట్ట దగ్గరలో వేస్తున్న మెడికల్ వ్యర్ధాలకు నిప్పు పెట్టడంతో దాని నుండి వచ్చే ప్రమాదకర పొగతో దగ్గలోని లెప్రసీ కాలనీ వాసులు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నామని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా తమ మొర ఆలకించే నాథుడే కరువయ్యాడని వాపోతున్నారు.ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు ఈ మెడికల్ వ్యర్డాలపై సీరియస్ గా దృష్టి సారించి,వాటిని ఇక్కడి నుండి దూర ప్రాంతాలకు తరలించాలని డిమాండ్ చేస్తున్నారు.

ప్రజల నుండి వస్తున్న డిమాండ్ ను బేఖాతర్ చేస్తూ ఎయిమ్స్ యాజమాన్యం చేస్తున్న ఈ నిర్లక్ష్యం ఖరీదు ఎన్ని ప్రాణాలకు ప్రమాదమో ప్రాణాలు పోసే వైద్యులే ఆలోచించాలి మరి…!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube