అందాల రాక్షసి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్గా పరిచయమయ్యారు నటి లావణ్య త్రిపాఠి ( Lavanya Tripati ) ఈ సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె అనంతరం హీరోయిన్గా ఇండస్ట్రీలో కొనసాగుతూ వచ్చారు.అయితే ఈమె మెగా హీరో వరుణ్ తేజ్ ( Varun Tej ) ప్రేమలో ఉంటూ నవంబర్ నెలలో వీరిద్దరి వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.
ఇలా పెళ్లి చేసుకొని లావణ్య త్రిపాఠి మెగా ఇంటి కోడలుగా అడుగుపెట్టారు.లావణ్య మెగా కోడలుగా అడుగుపెట్టిన తర్వాత ఈమెనూ సోషల్ మీడియాలో ఫాలో అయ్యే వారి సంఖ్య కూడా పెరిగింది.
ఇక సోషల్ మీడియాలో ఈమె ఎలాంటి పోస్ట్ చేసిన క్షణాల్లో వైరల్ అవుతుంది.

ఈ క్రమంలోనే లావణ్య త్రిపాఠి తాజాగా ఒక ఫోటోని సోషల్ మీడియా వేదికగా అభిమానుల కోసం షేర్ చేస్తూ శుభవార్తను తెలియజేశారు.మెగా కోడలు గుడ్ న్యూస్ చెప్పింది అంటే ఏంటోనని అభిమానులు కూడా ఆత్రుత పడుతున్నారు.అయితే ఈమె తనకు మేనల్లుడు పుట్టాడనే శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు.
ఈ క్రమంలోనే తన మేనల్లుడి ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.తన మొహం కనబడకుండా ఈమె బాబు ఫోటోని అభిమానులతో పంచుకున్నారు.

ఈ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసినటువంటి లావణ్య త్రిపాఠి తనుకు మేనల్లుడు పుట్టాడని చెప్పడమే కాకుండా తన సొట్టబుగ్గలు వారసత్వంగా తన మేనల్లుడు తీసుకున్నారు అంటూ చెప్పకు వచ్చారు.ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఫోటో వైరల్ అవుతుంది.ఇక లావణ్య పెళ్లి తర్వాత సినిమాలకు కమిట్ అవ్వలేదు కానీ పెళ్లికి ముందు ఈమె నటించిన సినిమాలు వెబ్ సిరీస్ ( Web series )లో త్వరలోనే విడుదల కావడానికి సిద్ధంగా ఉన్నాయి.మరి ఈమె ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతారా ఇండస్ట్రీకి దూరంగా ఉంటారా అనే విషయం తెలియాల్సి ఉంది.