సంక్రాంతి (Sankranthi) పండుగ అంటేనే థియేటర్ల వద్ద సినిమాల హడావిడి ఉంటుంది.చిన్న సినిమాల నుంచి మొదలుకొని పెద్ద హీరోల వరకు సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉంటారు.
ఈ క్రమంలోనే ఈ సంక్రాంతికి కూడా పెద్ద ఎత్తున సినిమాలు విడుదల కాబోతున్నాయి అయితే ఈ సినిమాలన్నీ కూడా నాన్ థియేట్రికల్ బిజినెస్ పూర్తి చేసుకుందని వీటి ద్వారానే భారీగా లాభాలు కూడా పొందారని తెలుస్తుంది.అయితే ఇలా సంక్రాంతి బరిలో ఉన్న సినిమాలన్నీ కూడా నాన్ థియేట్రికల్ బిజినెస్ పూర్తి చేసుకోగా ఇందులో గుంటూరు కారం సినిమా ఎక్కువగా బిజినెస్ జరుపుకుందని తెలుస్తుంది.
గుంటూరు కారం (Guntur kaaram) సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ 100 కోట్లకు అమ్మాలని గతంలోనే మేకర్స్ ఫిక్స్ అయ్యారు ఈ సినిమా హక్కులను జీ గ్రూప్స్ వారు తీసుకోబోతున్నారని కూడా వార్తలు వచ్చాయి .కానీ చివరి నిమిషంలో జెమినీ టీవీ వాళ్ళు ఈ సినిమా సాటిలైట్ హక్కులను అలాగే నెట్ ఫిక్స్ డిజిటల్ హక్కులను కొనుగోలు చేశారని తెలుస్తుంది.అదేవిధంగా ఆడియో రైట్స్ అన్ని కలిపి మేకర్స్ అనుకున్నటువంటి టార్గెట్ రీచ్ అయ్యారని తెలుస్తుంది.
ఇక హనుమన్ (Hanuman) సినిమా హక్కులను జీ స్టూడియోస్ వారు సాటిలైట్ అలాగే డిజిటల్ హక్కులను కూడా కొనుగోలు చేశారు.ఈ సినిమా నాన్ థియేట్రికల్ హక్కులను 27 కోట్లకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది.ఇక సైంధవ్ (Saindhav) సినిమా సాటిలైట్ హక్కులు ఈ టీవీ చేతికి వెళ్ళగా డిజిటల్ హక్కులు మాత్రం అమెజాన్ ప్రైమ్ వారు సొంతం చేసుకున్నారు.
అదేవిధంగా నాగార్జున కూడా ఈ సంక్రాంతి బరిలో దిగబోతున్నారు.నాగార్జున నటిస్తున్నటువంటి నా సామిరంగా(Naa Saamiranga) సినిమా శాటిలైట్ హక్కులు స్టార్ మా కైవసం చేసుకోగా డిజిటల్ హక్కులు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కైవసం చేసుకున్నారు.