సోషల్ మీడియా వచ్చాక చాలా సంగతులు ప్రజలకు తెలుస్తున్నాయి మరుగునపడిన అనేక విషయాలు యూట్యూబ్ ఛానల్ లో దర్శనమిస్తున్నాయి ఇటీవల కాలంలో హరిత మరియు రవళిల తల్లి విజయలక్ష్మి( Vijayalakshmi ) యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూస్ హడావిడి చేస్తున్న సంగతి మనకు తెలిసిందే అయితే ఒక సంఘటన విషయంలో ఆమె డైరెక్టర్ కోదండరామిరెడ్డి గారిని ఇచ్చాడా మడ తిట్టిన విషయం ఇటీవలే తెలిపారు మరి అంత పెద్ద డైరెక్టర్ ను తిట్టడానికి గల కారణం ఏమిటి అనే విషయాన్ని ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

రవళి తల్లి విజయలక్ష్మి అసలు పేరు కనకదుర్గ ఆమె మొదట సినిమా ఇండస్ట్రీకి వచ్చారు తల్లి పాత్రలో నటిస్తూ అప్పట్లో బాగానే పాపులారిటీ సంపాదించారు.దాదాపు 40 చిత్రాల్లో తల్లి పాత్రలో నటించిన విజయలక్ష్మి తనతో పాటు వరసగా తన కూతురు హరితను( haritha ) కూడా షూటింగ్స్ కి తీసుకురావడంతో ఆమెను సైతం సినిమాల్లోకి రావాలని పలువురు ఆసక్తి చూపించడంతో హరిత కూడా నటిగా మారింది.హరిత అసలు పేరు శాంతి కాగా సినిమాల కోసం పేరు మార్చుకుంది.
అయితే మొదట తమిళ్ లో హీరోయిన్ గా సినిమాల్లో నటించిన హరిత తెలుగులోకి వచ్చేసరికి చెల్లెలి పాత్రలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.మొట్టమొదట కోదండరామిరెడ్డి ( Kodandarami Reddy )గారి దర్శకత్వంలో రాజశేఖర్ చెల్లిగా నటించిన ఆ తర్వాత అన్ని పాత్రలు అలాంటివే రావడంతో ఆమె హీరోయిన్ కాలేకపోయింది.

ఆ టైంలోనే పదవ తరగతి పూర్తి చేసుకున్న రవళి సైతం నటించడానికి ప్రయారిటీ ఇవ్వడంతో ఆమెను ఫోటోషూట్ చేసి ఆల్బమ్ తయారు చేసి పలువురు దర్శకులకు చూపించింది ఆమె తల్లి విజయలక్ష్మి అందంగా ఉంది హీరోయిన్గా పనికి వస్తుంది అని అందరూ చెప్పడంతో ఆమె సైతం హీరోయిన్ కావాలని ఫిక్స్ అయింది.అయితే ఈ విషయం తెలిసిన కోదండరామి రెడ్డి మరోమారు రవళికి అవకాశం ఇవ్వాలని అనుకున్నారు దాంతో విజయలక్ష్మిని పిలవగా ఆల్బమ్ చూపిస్తే చాలా చక్కగా ఉంది తన సినిమాలో చెల్లెలి పాత్ర కోసం తీసుకుంటాను అని చెప్పగా ఒక్కసారిగా ఆవేశానికి గురైన విజయలక్ష్మి చడామడా తిట్టేసారట.

అంత పెద్ద డైరెక్టర్ ను అలా తిట్టేసరికి ఆయన కూడా కంగుతున్నారట.మొట్టమొదటిగా హరితకు కూడా చెల్లి పాత్ర ఇచ్చి ఆయన ఇండస్ట్రీలోనే అందరికీ చెల్లెలుగా మార్చేసి హీరోయిన్ కాకుండా ఆమె కెరియర్ ను పాడు చేశారని కోపంతో విజయలక్ష్మి అలా మాట్లాడాల్సి వచ్చిందట.రవళి కూడా మళ్ళి చెల్లి పాత్రలోనే నడిస్తే వరుసగా అవే పాత్రలు వస్తాయని ఆమెను ఎంతమంది ఎన్ని చెప్పినా హీరోయిన్ చేసి తీరుతానని విజయలక్ష్మి ఆరోజే నిర్ణయించుకున్నారట.ఆ తర్వాత రవళి హీరోయిన్ గా మారి పెళ్లి సందడి వంటి అద్భుతమైన చిత్రాలు హీరోయిన్ గా నటించిన సంగతి మన అందరికీ తెలిసిందే.