కన్నడ చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా కొనసాగుతూ అనంతరం తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైనటువంటి వారిలో నటి రష్మిక మందన్న ( Rashmika Mandanna ) ఒకరు.ఈమె హీరోయిన్గా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు తెలుగులో కూడా వరుస సినిమా అవకాశాలను అందుకొని కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమెకు పుష్ప సినిమా ఎంతో పేరు ప్రఖ్యాతలను తీసుకువచ్చిందని చెప్పాలి ఈ సినిమా ఏకంగా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడంతో ఈమెకు బాలీవుడ్ సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి.

ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి రష్మిక గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈమె నటుడు విజయ్ దేవరకొండతో ప్రేమలో ఉన్నారని అయితే పెళ్లి చేసుకోవద్దు అని చెప్పినందుకు నాతో మాట్లాడటం లేదు అంటూ ఇటీవల వేణు స్వామి రష్మిక విజయ్ దేవరకొండ రిలేషన్ గురించి కూడా పలు విషయాలను వెల్లడించారు.

ఇకపోతే తాజాగా రష్మిక గురించి ఒక వార్త వైరల్ అవుతుంది రష్మి ఒక స్టార్ హీరోని ఏకంగా 20 సార్లు కొట్టింది అంటూ ఈ వార్త వైరల్ అవుతుంది.ఇటీవల సందీప్ రెడ్డి( Sandeep Reddy ) వంగ దర్శకత్వంలో రణబీర్ రష్మిక హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం యానిమల్( Animal ) ఈ సినిమాలో ఒక సన్నివేశాన్ని చేయడం కోసం రష్మిక ఏకంగా 20 సార్లు కొట్టిందంటూ ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు.ఈ సినిమాలో రష్మిక, రణబీర్ మధ్య వచ్చే కర్వా చౌత్ సన్నివేశం షూటింగ్ సమయంలోనే రష్మిక రణబీర్ పై చేయి చేసుకుందని తెలుస్తుంది.

ఈ సన్నివేశంలో రష్మిక రణబీర్ కపూర్ ను ఒక దెబ్బ కొడుతుంది అనే విషయం మనకు తెలిసిందే.అయితే ఈ షాట్ తీయడం కోసం దాదాపు 20 టేకులు తీసుకున్నారట ఇలా 20 సార్లు రష్మిక ఆయన్ని చెంపపై కొట్టింది అంటూ తాజాగా ప్రణయ్ రెడ్డి చేసినటువంటి ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఇక ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ ఆ సన్నివేశం చేయడానికి అన్ని టేకులు తీసుకున్నారా ఇది నిజంగానే అవమానం అంటూ ఈ మాటలపై కామెంట్లు చేస్తున్నారు.ఏది ఏమైనా ఇలా హీరోయిన్ చేతిలో ఇన్నిసార్లు తన్నులు తినడం అంటే హీరోకి కూడా ఇది అవమానమే అంటూ పలువురు అభిమానులు ఈ విషయంపై కామెంట్స్ చేస్తున్నారు.