పేదలకు ఆరోగ్యశ్రీ ఒక వరం..: సీఎం జగన్

ఏపీలో ఆరోగ్య శ్రీపై అవగాహన కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలోని పేదలకు ఆరోగ్య శ్రీ ఒక వరమని చెప్పారు.

 Arogyashri Is A Boon For The Poor: Cm Jagan-TeluguStop.com

వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటితే ఆరోగ్య శ్రీ కిందకు తీసుకొచ్చామని తెలిపారు.

మొత్తం 3,257 ప్రొసీజర్లను ఆరోగ్య శ్రీ కిందకు తీసుకొచ్చామని సీఎం జగన్ పేర్కొన్నారు.సుమారు 4 కోట్ల 25 లక్షల మందికి ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింపజేశామన్నారు.అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఆరోగ్య శ్రీ కార్డు అందించనున్నారని తెలిపారు.ఆరోగ్య శ్రీ కింద ఏడాదికి రూ.4,100 కోట్లు ఖర్చు చేస్తున్నామన్న సీఎం జగన్ ఇప్పటివరకు 25 లక్షల మందికి పైగా ఆరోగ్య ఆసరా అందించామని తెలిపారు.ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్ల కొరత లేకుండా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.

ప్రతి మండలానికి రెండు పీహెచ్సీలు ఏర్పాటు చేశామన్న ఆయన నాడు-నేడుతో అన్ని ఆస్పత్రుల్లో మౌలిక వసతులు కల్పించామని స్పష్టం చేశారు.అలాగే ఏపీలో కొత్తగా 17 మెడికల్ కాలేజీలను నిర్మిస్తున్నామని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube