తెలుగు బిగ్ బాస్ సీజన్ 7( Bigg Boss 7 Telugu ) కూడా పూర్తి అయింది.ఈ సీజన్ కి గతంలో మాదిరిగానే పెద్దగా రేటింగ్ రాలేదు.
వీక్ డేస్ రేటింగ్ మరీ వీక్ గా ఉంటే, వీకెండ్ ఎపిసోడ్స్ రేటింగ్ కూడా వీక్ గానే నమోదు అయింది.సరే ఫైనల్ ఎపిసోడ్ కి అయినా మంచి స్పందన వస్తుందని స్టార్ మా వారు ఆశిస్తే అది కూడా వర్కౌట్ అయినట్లుగా కనిపించడం లేదు.
స్టార్ మా లో టెలికాస్ట్ అయిన బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే( Bigg Boss Grand Finale ) ఎపిసోడ్ కు గత ఫినాలే ఎపిసోడ్స్ కి వచ్చినంత స్పందన రాలేదు అంటూ కొన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
విన్నర్ విషయం లో ఒక స్పష్టమైన పుకారు షికారు చేసింది.
రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్( Pallavi Prashanth ) విన్నర్ అంటూ ముందుగానే చాలా మంది ఊహించేశారు.దాంతో ఎవరు విజేత అనే విషయంలో ఆసక్తి, ఉత్కంఠ కనిపించలేదు.
అందుకే ఎపిసోడ్ ను ఎక్కువ మంది చూడలేదు అంటూ బిగ్ బాస్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.రేటింగ్ విషయం ముందు ముందు అధికారికంగా వస్తుంది.ఆ విషయం పక్కన పెడితే ఒక సామాన్యుడిగా హౌస్ లో అడుగు పెట్టిన పల్లవి ప్రశాంత్ అద్భుతమైన ఆట తీరుతో,
శివాజీ( Shivaji ) యొక్క ప్రోత్సాహం మరియు బయటి ఆయన అభిమానులు మరియు ప్రేక్షకుల మద్దతుతో విజయాన్ని సొంతం చేసుకున్నాడు.గత రెండు మూడు వారాలుగా అనుకుంటున్నట్లుగానే అమర్( Amardeep ) మరియు పల్లవి ప్రశాంత్ లు టాప్ 2 కి వచ్చారు.శివాజీ టాప్ 3 వరకు కొనసాగాడు.అర్జున్ అంబటి( Ambati Arjun ) వైల్డ్ కార్డ్ ఎంట్రీ అవ్వడం వల్ల టాప్ 6 గా నిలిచాడు.ముందు వచ్చి ఉంటే కచ్చితంగా అర్జున్ అంబటి టాప్ 2 లో ఉండే వాడు అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇక టాప్ 5 లో ఒకే ఒక్క అమ్మాయి గా ప్రియాంక( Priyanka ) నిలిచింది.ఆమె టాప్ 3 వరకు వచ్చే అర్హత కలిగిన అమ్మాయి అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.ఇక యావర్( Yawar ) 15 లక్షల రూపాయలు తీసుకుని బయటకు వచ్చేయడం జరిగింది.
మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 7 పూర్తి అయింది.సీజన్ 8 కి ముందు బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ 2 ఓటీటీ వర్షన్ ఉంటుందనే వార్తలు వస్తున్నాయి.