పేదలకు ఆరోగ్యశ్రీ ఒక వరం..: సీఎం జగన్
TeluguStop.com
ఏపీలో ఆరోగ్య శ్రీపై అవగాహన కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలోని పేదలకు ఆరోగ్య శ్రీ ఒక వరమని చెప్పారు.
వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటితే ఆరోగ్య శ్రీ కిందకు తీసుకొచ్చామని తెలిపారు.
మొత్తం 3,257 ప్రొసీజర్లను ఆరోగ్య శ్రీ కిందకు తీసుకొచ్చామని సీఎం జగన్ పేర్కొన్నారు.
సుమారు 4 కోట్ల 25 లక్షల మందికి ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింపజేశామన్నారు.అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఆరోగ్య శ్రీ కార్డు అందించనున్నారని తెలిపారు.
ఆరోగ్య శ్రీ కింద ఏడాదికి రూ.4,100 కోట్లు ఖర్చు చేస్తున్నామన్న సీఎం జగన్ ఇప్పటివరకు 25 లక్షల మందికి పైగా ఆరోగ్య ఆసరా అందించామని తెలిపారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్ల కొరత లేకుండా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.ప్రతి మండలానికి రెండు పీహెచ్సీలు ఏర్పాటు చేశామన్న ఆయన నాడు-నేడుతో అన్ని ఆస్పత్రుల్లో మౌలిక వసతులు కల్పించామని స్పష్టం చేశారు.
అలాగే ఏపీలో కొత్తగా 17 మెడికల్ కాలేజీలను నిర్మిస్తున్నామని వెల్లడించారు.
బాలయ్య కూడా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడా..?