టీడీపీలోనూ అదే గుబులు ?

ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది ప్రధాన పార్టీలు అనుసరిస్తున్న వ్యూహాలు రాజకీయ వేడిని పెంచుతున్నాయి.వచ్చే ఎన్నికల్లో మరోసారి గెలుపే లక్ష్యంగా వైసీపీలో ప్రక్షాళన మొదలు పెట్టారు అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.

 Doubt Is The Same In Tdp, Gorantla Butchaiah Chowdary , Tdp, Ap Politics , Chan-TeluguStop.com

ఇప్పటికే పార్టీలో ఇంచార్జ్ ల మార్పుతో పాటు సిట్టింగ్ స్థానలో కూడా మార్పుకు తెరతీస్తున్నారు.ఈ నేపథ్యంలో వైసీపీ( YCP )లోని చాలమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు డౌటే అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి.

అంతేకాకుండా సీనియర్స్ ను కూడా పక్కన పెట్టె ఆలోచనలో జగన్ ఉన్నట్లు వినికిడి.ఇక అటు టీడీపీలో ఇదే తంతు జరగబోతుందా అంటే అవుననే సమాధాలు వినిపిస్తున్నాయి.

Telugu Ap, Chandra Babu, Jyothula Nehru, Ys Jagan-Politics

ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలగా ఉన్న చంద్రబాబు( Chandra babu naidu ) సీట్ల కేటాయింపులో ఖరాఖండీగా ఉండబోతున్నాట్లు ఇప్పటికే క్లియర్ కట్ సంకేతాలు ఇచ్చారు.ప్రజా మద్దతు ఉన్నవారికే సీట్ల కేటాయింపు ఉంటుందని, ఇందులో ఎలాంటి డౌట్ ఉండబోదని చంద్రబాబు ఇటీవల తేల్చిచెప్పారు.అంతే కాకుండా ఈసారి యాబై శాతం కొత్తవారికి అవకాశం ఇచ్చే విధంగా చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారట.ఈ నేపథ్యంలో పార్టీలోని కొంతమంది సీనియర్స్ కు ఈసారి సీటు కష్టమే అనే వాదన వినిపిస్తోంది.

Telugu Ap, Chandra Babu, Jyothula Nehru, Ys Jagan-Politics

ముఖ్యంగా బుచ్చయ్య చౌదరి ( రాజమండ్రి రూరల్ )( Gorantla Butchaiah Chowdary ), బండారు సత్యనారాయణ ( పెందుర్తి ) , కాకినాడ సిటీ నుంచి కొండబాబు, జ్యోతుల నెహ్రూ ( జగ్గం పేట ) వంటి వారికి ఈసారి సీటు కష్టమే అనే టాక్  వినిపిస్తోంది.దాంతో టీడీపీ సీనియర్ నేతల పోలిటికల్ లైఫ్ ఎంటనేది ప్రశ్నార్థకంగా మారింది.అయితే టీడీపీతో ఈసారి జగనసేన పార్టీ కూడా పొత్తులో ఉన్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఇరు పార్టీల మద్య సీట్ల కేటాయింపు కారణంగా టీడీపీలోని చాలమంది ఆశావాహులకు సీట్లు కష్టమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

దీంతో చాలమంది నేతల్లో గుబులు పుడుతోంది.ఇప్పటికే  వైసీపీలో సీట్లపై డౌట్ గా ఉన్న నేతలు టీడీపీతో టచ్ లోకి వెళ్ళినట్లు వార్తలు వస్తున్నాయి.మరి టీడీపీలో కూడా సీట్లు దక్కని నేతలు వైసీపీతో టచ్ లోకి వెళ్తారేమో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube