వీడియో: ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రోబో డాగ్ ఇదే.. ఎంత ఫాస్ట్‌గా ఉరుకుతుందో..

సాధారణంగా రోబోలు నత్తనడకన నడుస్తాయి.అయితే సౌత్ కొరియాకు చెందిన ఇంజనీర్ల బృందం ఒక ఫాస్టెస్ట్ రన్నింగ్ రోబో( Fastest running robot ) తయారు చేసింది.

 Video: This Is The Fastest Robot Dog In The World.. How Fast It Can Run , Viral-TeluguStop.com

దాని పేరు హౌండ్.ఇది ఒక కుక్కలాంటి రోబో.

ఇంజనీర్ల టీం తయారు చేసిన ఈ రోబో ఇతర నాలుగు కాళ్ల రోబో కంటే వేగంగా పరిగెత్తగలదు.తాజాగా ఈ హౌండ్ రోబో జస్ట్ 19.87 సెకన్లలో 100 మీటర్ల దూరాన్ని కవర్ చేసింది.అత్యంత వేగవంతమైన స్ప్రింట్ తీసిన నాలుగు కాళ్ల రోబోగా( Robo ) ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది.

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఆల్రెడీ దీని వేగాన్ని వెరిఫై చేసి అవార్డు కూడా ఇచ్చేసింది.రోబో స్టార్టింగ్ నుంచి ఈ సమయ లెక్కింపు జరిగింది.ఎండ్ లైన్ దాటిన తర్వాత స్టాప్ వాచ్ ఆపేశారు.ఒకే మోటారు కంట్రోలర్‌తో కారణంగా హౌండ్ చాలా స్పీడ్‌తో ఫాస్ట్‌గా పరిగెత్తింది.దీనికి అలా వేగంగా పరిగెత్తే ఎలా ట్రైనింగ్ ఇచ్చారు.రోబో తేలికపాటి పాదాలు, సమాంతర హిప్, నీ-కాన్ఫిగరేషన్, విస్తృత శ్రేణి కదలికతో కదలడానికి అనుమతించే బెల్ట్-పుల్లీ వ్యవస్థను కలిగి ఉంది.

హౌండ్ బరువు 45కేజీలు, ఇది సగటు మగ అమెరికన్ బుల్‌డాగ్‌తో సమానమైన బరువును కలిగి ఉంటుంది.డేజియోన్‌లోని కొరియా అడ్వాన్స్‌డ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డైనమిక్ రోబోట్ కంట్రోల్ అండ్ డిజైన్ లాబొరేటరీలో పనిచేసే ఇంజనీర్లు భవిష్యత్తులో రోబో పనితీరును అధిక వేగంతో పరీక్షించాలని ప్లాన్ చేస్తున్నారు.ఈ రోబోకి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో( Social media ) వైరల్ గా మారింది. ఆ వీడియోలో రోబో డాగ్ ( Robot dog )చాలా వేగంగా పరిగెత్తడం మనం గమనించవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube