సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) లేటెస్ట్ గా నటిస్తున్న భారీ మాస్ యాక్షన్ మూవీ ”గుంటూరు కారం’‘( Guntur Karam ).మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం సూపర్ స్టార్ ఫ్యాన్స్ అంత ఎదురు చూస్తున్నారు.
వచ్చే నెల సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే మిగిలిన షూట్ మొత్తం ఈ నెలలోనే ఫినిష్ చేయాలనీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.అతి త్వరలోనే మహేష్, శ్రీలీలపై మూడవ సాంగ్ ను కేరళలో షూట్ చేయనున్నారని టాక్.ప్రస్తుతం ఈ సినిమా వేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా ఈ సినిమా సెకండ్ సింగిల్ గురించి అప్డేట్ తెలుస్తుంది.
ఫస్ట్ సింగిల్ చార్ట్ బస్టర్ గా నిలువగా సెకండ్ సింగిల్ కోసం అంత ఎదురు చూస్తున్నారు.
ఈ క్రమంలోనే నిర్మాత నాగవంశీ సెకండ్ సింగిల్ ( Guntur Kaaram Second Single) పై అప్డేట్ ఇచ్చారు.నితిన్ ( Nithiin ) ఈ సెకండ్ సాంగ్ అప్డేట్ ను ట్విట్టర్ వేదికగా అడుగగా రెండు రోజుల్లో అప్డేట్ ఇస్తామని నాగవంశీ ( Suryadevara Naga Vamsi ) తెలిపారు.మరి చెప్పినట్టుగానే రేపు ఈ సినిమా నుండి సెకండ్ సాంగ్ ఎప్పుడు రిలీజ్ చేస్తామో అఫిషియల్ గా చెప్పబోతున్నట్టు టాక్.
ఇదిలా ఉండగా ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్ లుగా నటిస్తుండగా హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానుంది.