రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట( Ellantakunta ) ఎస్సై డి సుధాకర్( SI D Sudhakar ) తన సిబ్బందితో కలిసి మంగళవారం రోజున సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పోస్టల్ బ్యాలెట్ ఫెలిసియేషన్ సెంటర్ వద్ద యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు.ప్రతి ఒక్కరూ ఓటు హక్కు ను వినియోగించుకోవాలి అని , ఓటు అనేది ప్రజాస్వామ్యంలో ఎంతో విలువైనదని ఇల్లంతకుంట ఎస్సై డి సుధాకర్ తెలిపారు.
ఓటు హక్కు ద్వారా ఎంతో పారదర్శకంగా మనల్ని పరిపాలించే నాయకులను ఎన్నుకోగలుగుతున్నామని, ప్రలోభాలకు లోనై ఓటును దుర్వినియోగం చేస్తే,అనేక దుష్ప్రభావాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంటుందన్నారు.
నా ఒక్క ఓటుతో ఏమవుతుందిలే అనే భావన ఎంతమాత్రం సరికాదన్నారు.
ఎలక్షన్ డే అంటే హాలీడే కాదని, మన భవితను నిర్దేశించుకునే అతి కీలకమైన రోజుగా గుర్తించాలని సూచించారు.విద్యావంతులు ఎక్కువగా ఉండే పట్టణాలు, నగరాల్లో ఓటింగ్ శాతం తక్కువగా నమోదకావడం దురదృష్టకరమన్నారు.
మనల్ని పాలించే వారిని మనం ఎన్నుకునే బాధ్యతను విస్మరించడం ఎంతవరకు సమంజసమో ప్రతిఒక్కరూ ఆలోచన చేయాలన్నారు.